Keerthi Bhat : ఇండస్ట్రీలో ఛాన్సులు రావాలంటే గ్లామర్ చూపించాలి.. లేదంటే కమిట్ మెంట్ ఇవ్వాలి అంటూ చాలా మంది నటీమణులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో నటి ఇలాంటి కామెంట్లే చేసి సంచలనం రేపింది. మనకు తెలిసిందే కదా.. బిగ్ బాస్ కు వెళ్లిన చాలా మంది టీవీ షోలల్లో కనిపిస్తూ హల్ చల్ చేస్తుంటారు. ప్రతి పండగకు చేసే ఈవెంట్లలో వాళ్లే స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటారు. కానీ బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న కీర్తి భట్ మాత్రం ఎక్కడా కనిపించదు. ఇలా ఎందుకు కనిపించదనే విషయంపై తాజాగా ఆమె షాకింగ్ కామెంట్స్ చేసి సంచలనం రేపింది.
Read Also : Bhojpuri Actor : మహిళా అభిమాని బాడీపై స్టార్ నటుడి చెత్త కామెంట్లు..
టీవీ షోలల్లో యాంకర్ గానో లేదంటే కంటెస్టెంట్ గానో కనిపించాలంటే గ్లామర్ చూపించాలి. ఆ షో వాళ్లు చెప్పినట్టు మోకాళ్ల పైకి పొట్టిబట్టలు వేసుకోవాలి. ఎక్స్ పోజింగ్ చేయాలి. అలాంటి వారికి మాత్రమే ఛాన్సులు ఇస్తారు. కానీ నాకు అలాంటివి ఇష్టం లేదు. నన్ను ఎంతో మంది అడిగినా నేను చేయనని చెప్పేశాను. నేను గతంలోనూ ఇలాంటివే చెప్పాను. కానీ కొందరు వేరేలా అర్థం చేసుకుని నన్ను ట్రోల్స్ చేశారు. అవన్నీ నేను పట్టించుకోను. గ్లామర్ ఎక్స్ పోజ్ చేయడం.. వాళ్లు చెప్పినట్టు కెమెరాల ముందు సర్కస్ చేయడం నాకు నచ్చదు. అందుకే నాకు ఛాన్సులు ఇవ్వరు అంటూ తెలిపింది కీర్తి భట్.
Read Also : Nara Rohith : శిరీషతో పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్
