Site icon NTV Telugu

Kayadu Lohar: “అదృష్టం అంటే ఈమెదే.. మొదటి సినిమా దెబ్బతిన్నా చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు!

Kayadu Lohar

Kayadu Lohar

సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా కొందరు నటీనటులకు అదృష్టం అలా కలిసి వస్తుంటుంది. సరిగ్గా ఇదే విషయం ఇప్పుడు హీరోయిన్ కయాదు లోహర్ విషయంలో నిజమవుతోంది. ఇటీవలే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఫంకీ’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినప్పటికీ, ఈ భామకు మాత్రం టాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడుతున్నాయి. సాధారణంగా మొదటి సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లకు అవకాశాలు రావడం కష్టం. కానీ కయాదు లోహర్ తన గ్లామర్ మరియు నటనతో ఇండస్ట్రీ వర్గాలను ఆకర్షించగలిగింది. అందుకే, ఆమె ఖాతాలో ఇప్పుడు వరుసగా ఆఫర్లు వచ్చి చేరుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, కయాదు ఇప్పటికే రెండు కొత్త చిత్రాలకు సంతకం చేసిందట. ఈ రెండు కథలు కూడా వైవిధ్యంగా ఉండటంతో పాటు ఆమె పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాల సక్సెస్‌తో సంబంధం లేకుండా కయాదుకు ఉన్న డిమాండ్ చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.

Also Read:Tollywood Excusive: సినిమా హిట్ అయితే హీరో హీరోయిన్లకు నేము, ఫేము.. మరి ప్లాప్ అయితే!

కొత్త సినిమాల కోసం ఆమె భారీగానే డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒక్కో సినిమాకు కయాదు సుమారు కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు సమాచారం. వరుస అవకాశాలు వస్తుండటంతో, నిర్మాతలు కూడా ఆమె అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు వెనకాడటం లేదట. తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో కోటి రూపాయల క్లబ్‌లో చేరడం అంటే మామూలు విషయం కాదు. తన క్రేజ్‌ను పక్కాగా క్యాష్ చేసుకుంటూ కయాదు దూసుకుపోతోంది. కయాదు లోహర్ ప్రస్తుతం సంతకం చేసిన ఈ రెండు సినిమాలు గాని బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంటే, ఆమె రేంజ్ మరింత పెరగడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్ల కొరత కూడా ఈమెకు ప్లస్ పాయింట్‌గా మారుతోంది. మరి ఈ క్రేజీ ఆఫర్లతో కయాదు తన లక్ మార్చుకుంటుందో లేదో చూడాలి!

Exit mobile version