Site icon NTV Telugu

Kaushal Manda: 250 కోట్లతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నా.. మీ హీరోలందరూ గెస్ట్ లుగా చేస్తున్నారు

Kaushal

Kaushal

Kaushal Manda: కౌశల్ మండ గురించి తెలియని వారు ఉండరు. బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ క్రియేట్ చేసిన రికార్డ్ ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు. కౌశల్ ఆర్మీ పేరుతో అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ప్రేక్షకుల అభిమానంతో రెండో సీజన్ కు విన్నర్ గా గెలిచి ట్రోఫీతో బయటకు వచ్చాడు. ఇక బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన వాళ్ళందరి లైఫ్ లో మారిపోతాయి అనుకుంటారు కానీ, అంతకుముందు ఉన్న లైఫ్ కన్నా దారుణంగా మారుతూనే అనేది నమ్మదగ్గ నిజం. ఇప్పటివరకు బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన కంటెస్టెంట్.. కెరీర్ లో మంచిగా నిలబడిన దాఖలాలు లేవు. కౌశల్ కూడా ఆ కోవలోకే వస్తాడు. విన్నర్ గా గెలిచిన తరువాత కౌశల్ హీరో అవుతాడని అభిమానులు అనుకున్నారు. కౌశల్ కూడా చాలానే ట్రై చేశాడు. కానీ, కుదరలేదు. ఇక ఎప్పటిలానే తన స్టూడియో చూసుకుంటూ.. అప్పుడప్పుడు షోస్ లో పాల్గొంటూ కనిపించాడు.

ఇక బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పటి నుంచి అందులో జరిగే విషయాలను.. ఎనలైజ్ చేస్తూ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. ఈ మధ్య పల్లవి ప్రశాంత్ విన్నర్ కావడం, గొడవలు.. వాటిపై కూడా తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కౌశల్ తన కొత్త సినిమా గురించి చెప్పి ఆశ్చర్యపరిచాడు. ” నేను ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా చేస్తున్నాను.. రూ. 250 కోట్లు బడ్జెట్. త్వరలో అన్ని డీటెయిల్స్ చెప్తాను.. మీ హీరోలందరూ గెస్ట్ లుగా చేస్తున్నారు” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మీ హీరోలు అని అనడంతో చాలామంది ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మీ హీరోలు ఏంటి.. ? అని కొందరు.. నువ్వు హీరోగా అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్న నిర్మాత ఎవరో.. ? అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఆ సినిమా ఎలాంటిందో తెలియాలంటే డీటెయిల్స్ వచ్చేవరకు ఆగాల్సిందే.

Exit mobile version