“బిగ్ బాస్ తెలుగు సీజన్ 2” విజేత కౌశల్ మండా “బిగ్ బాస్ తెలుగు” సీజన్స్ లో చెప్పే జోస్యం దాదాపుగా నిజం అవుతూ వస్తోంది. కౌశల్ ప్రతి సీజన్ లోనూ షోను అనుసరిస్తూ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్ పర్మార్మెన్స్ ఆధారంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. బిగ్ బాస్ తెలుగు హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కౌశల్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని కూడగట్టుకున్న విషయం తెలిసిందే.
Read Also : The Kashmir Files : అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర… ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఇక ప్రస్తుతం కొనసాగుతున్న “బిగ్ బాస్ నాన్ స్టాప్” గురించి కూడా కౌశల్ స్పందించాడు. కౌశల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో “బిగ్ బాస్ తెలుగు OTT” మొదటి విజేత బిందు మాధవి అని పోస్ట్ చేశాడు. “ఇప్పటి వరకు, బిగ్‌బాస్ (టి)లో విజేతను అంచనా వేయడంలో నా ప్రకటన ఎప్పుడూ తప్పు కాలేదు. ఈసారి బిందు మాధవికి మొదటి బిగ్‌బాస్ (OTT) గెలిచే అవకాశం 90% ఉంది. కొన్ని ప్రోమోలను చూసిన తర్వాత అలాగే అన్పిస్తోంది. ఇతరులతో పోల్చినప్పుడు ఆమె భిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తుంది కాబట్టి ఆమెకు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాను” అన్నారు. ఇక మాజీ కంటెస్టెంట్లు రెండోసారి కూడా బిగ్ బాస్ గేమ్‌ను అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్నారని పేర్కొన్నాడు.
