Katrina Kaif: బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరుతెచ్చుకున్న జంట కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్. విక్కీ కన్నా కత్రీనా వయస్సులో పెద్దది. విక్కీ హీరో కాకముందే కత్రీనా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతుంది. ఇక కత్రీనాను చూస్తే చాలు అనుకున్న విక్కీకి ఆమె భార్యగా రావడం అనేది విధి అని చెప్పాలి. తాజాగా ఈ విషయాన్నీ కత్రీనా కూడా చెప్పుకొచ్చింది. ఇటీవలే కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఆమె తమ బంధం ఎలా మొదలయ్యిందో చెప్పుకొచ్చింది.
“అసలు విక్కీ నా కనుచూపు మేరలో కూడా లేడు. అతడి పేరు వినడమే తప్ప ఎప్పుడు కలిసింది కూడా లేదు. అయితే అనుకోకుండా మా ఇద్దరి మధ్య అనుబంధం ఎలా మొదలయ్యిందో నాకు తెలియదు. మేము కలిసినప్పుడు ఏవేవో యాదృచ్చిక ఘటనలు జరుగుతూ ఉండేవి. విక్కీ ని కలిసిన ప్రతిసారి అతడి మనసు గెలిచాను. ఇది నా విధి. విక్కీతోనే నా జీవితం అని విధి ఎప్పుడో రాసి ఉంది. ఒకానొక సమయంలో నేనే నమ్మలేని విషయాలు జరిగాయి” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కత్రీనా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఏదిఏమైనా విధి ఎవరిని ఎప్పుడు కలుపుతుందో చెప్పలేమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే వీరిద్దరి కెరీర్ విషయానికొస్తే కత్రీనా ప్రస్తుతం ఫోన్ భూత్, టైగర్ 3 , మేరీ క్రిస్మస్ చిత్రాల్లో నటిస్తుండగా.. విక్కీ, గోవింద్ నామ్ మేరా చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాడు.