Site icon NTV Telugu

మల్లీశ్వరి నవ్వుకు మాల్దీవులు కూడా ఫిదా కావాల్సిందే..

katrinaa

katrinaa

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ని వివాహమాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా కొన్ని కమిట్ మెంట్స్ ఉండడం వలన ఈ జంట హనీమూన్ కి కూడా వెళ్లలేదని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ జంట హనీమూన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా కత్రినా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని షేర్ చేస్తూ “మై హ్యపీ ప్లేస్” అని రాసుకొచ్చింది. ఇక మాల్దీవుల్లో బీచ్ ఒడ్డున అమ్మడు ఎంతో అందంగా కనిపించింది. గ్రీన్ కలర్ డ్రెస్ లో నవ్వులు చిందిస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. కొత్త పెళ్లికూతురు బీచ్ లో ఎంజాయ్ చేస్తోంది అని, ఆ నవ్వులతోనే విక్కీని పడేసింది అని కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version