Vivek Agnihothri: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా ఆ డైరెక్టర్ గురించి దేశం అంతా మాట్లాడుకొనేలా చేసింది. వివాదాలు, విమర్శలు, ప్రశంసలు.. ఒక్కటి కాదు.. ఇవన్నీ అందుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశం మొత్తం తన గురించి, తన సినిమా గురించి మాట్లాడుకొనేలా చేశాడు. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని ఒక ఎత్తులో నిలబెట్టాడు. తో ఆయనకు ప్రశంసలే కాదు బెదిరింపులు కూడా వచ్చాయి. ఉగ్రవాదుల నుంచి హత్యా బెదిరింపులు కూడా అందుకున్న ఈ దర్శకుడు తాజాగా ఒక విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశాడు.
ముంబైలో దాదాపు రూ.18 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను ఆయన కొనుగోలు చేసినట్టు బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. బాలీవుడ్ బడా నటులు ఉండే అంధేరిలో ఈ ఫ్లాట్ ఉన్నదట. 3258 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 వ ఫ్లోర్ లో ఈ ప్లాట్ ఉన్నదని తెలుస్తోంది. ఇక ఈ ఇంటికి అడ్వాన్సుగా రూ. 1.07 కోట్లు చెల్లించారని, త్వరలోనే రిజిస్ట్రేషన్ పనులు కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం వివేక్ సిక్కుల ఉచకోతను ప్రజల ముందుకు తీసుకురానున్నాడు. వివాదస్పద సినిమాలతో పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు ముందు ముందు ఎలాంటి వివాదాస్పద సినిమాలను ప్రజలకు చూపించనున్నాడో చూడాలి.
