NTV Telugu Site icon

Kartikeya 2: సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం

Kartikeya 2 Motion Poster

Kartikeya 2 Motion Poster

ప్రస్తుతం టాలీవుడ్‌లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘కార్తికేయ 2’ ఒకటి. నిఖిల్ సిద్ధార్థ్, చందూ మొండేటి కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రం.. బ్లాక్‌బస్టర్ ‘కార్తికేయ’కి సీక్వెల్. చాలాకాలం నుంచి నిర్మాణ దశలోనే ఉన్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఉరుములు, మెరుపులతో ప్రారంభమయ్యే ఈ మోషన్ పోస్టర్‌లో ఓ రహస్యాన్ని చేధించేందుకు సముద్రంలో ప్రయాణిస్తోన్న నిఖిల్, అనుపమ, శ్రీనివాస రెడ్డిని గమనించవచ్చు. ఇన్నాళ్ళూ ఇది ఏ థీమ్‌తో రూపొందుతోందా? అనే మిస్టరీ నెలకొనగా, ఈ మోషన్ పోస్టర్‌తో అది రివీల్ అయ్యింది. సముద్రంలో మునిగిపోయిన ‘ద్వారకా’ నగరం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని స్పష్టమైంది.

ద్వారకా నగరం.. సంస్కృత మహాభారత కావ్యం ప్రకారం ఇది కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత సముద్రగర్భంలో కలిసిపోయింది. మగధరాజైన జరాసంధుడి దండయాత్రల నుండి ప్రజలను కాపాడేందుకు వాసుదేవ కృష్ణుడు ఈ నగరాన్ని నిర్మించారు. సముద్ర గర్భంలో ఉండే ద్వీపాల సమూహాలను ఎంచుకుని.. ఆయన ఈ నగరాన్ని నిర్మించారట! ఈ నగరానికి అనేక ద్వారాలు ఉండటం వల్ల దీనికి ద్వారకా నగరం అనే పేరు పెట్టారు. ఎన్నో రహస్యాల్ని దాచిపెట్టుకున్న ఈ నగరం గురించే ‘కార్తికేయ 2’లో చూపించనున్నారు. ఇది పాన్ ఇండియా సబ్జెక్ట్ కావడంతో, ప్యాన్ ఇండియా సినిమాగా దీన్ని విడుదల చేస్తున్నారు. సబ్జెక్ట్ చాలా ఆసక్తికరమైంది, సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటే.. బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయం!