Site icon NTV Telugu

Karthikeya: 48 గంటల్లో ముసుగులు తియ్యబోతున్నాం…

Karthikeya

Karthikeya

యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కార్తికేయకి హీరోయిన్ గా నేహ శెట్టి నటిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ గా బెదురులంక 2012 సినిమా తెరకెక్కుతుంది అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇటివలే హీరో ఫస్ట్ లుక్, హీరోయిన్ ఫస్ట్ లుక్, మూవీ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచిన చిత్ర యూనిట్ లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ కి రెడీ అయిపోయారు. ఫిబ్రవరి 10న ఈవెనింగ్ 5కి బెదురులంక టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్ ని లాంచ్ చేశారు. ఇందులో ఉండే మాస్కులు టీజర్ తో బ్రేక్ చేస్తాం అని కార్తికేయ త్వీట్ చేశాడు. మరి ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఆడియన్స్ ద్రుష్టి పడేలా చేసిన బెదురులంక 2012 టీజర్ తో ఇంకెంతలా అట్రాక్ట్ చేస్తారో చూడాలి. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న కార్తికేయకి బెదురులంక సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. ఆ మచ్ నీడెడ్ హిట్ ని ఈ మూవీ ఇస్తుందేమో అని కార్తికేయ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.

Read Also: Bollywood: ఆమిర్ రికార్డుని బద్దలుకొట్టిన షారుఖ్…

Read Also: Yasaswi Kondepudi : సరిగమప విన్నర్‌ యసస్వి కొండెపుడిపై చీటింగ్‌ ఆరోపణలు

Exit mobile version