Karthika Deepam: ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. అంటూ వంటలక్క పాడుతుంటే ఆమెతో కూడా పాడారు అభిమానులు. ఆమె ఏడిస్తే ఏడ్చారు.. నవ్వితే నవ్వారు. ఆమెకు మగవారు కూడా ఫ్యాన్స్ గా మారిపోయారు. అది కార్తీక దీపం సీరియల్ కు ఉన్న పవర్. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఈ క్యారెక్టర్స్ ను ప్రజలు ఎప్పటికి మర్చిపోలేరు. అంతగా ప్రజల గుండెల్లో పెనవేసుకున్న సీరియల్ కార్తీక దీపం. దీప గా ప్రేమి విశ్వనాధ్, డాక్టర్ బాబుగా నిరుపమ్ నటించారు అనడం కన్నా జీవించారు అని చెప్పాలి. ఎన్నో ఏళ్ళు విజయవంతంగా సాగిన ఈ సీరియల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. ఇక ఆ ముగింపు లో కూడా సీక్వెల్ ఉన్నట్లు ప్రకటించడంతో అభిమానులు సీజన్ 2 కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే సీజన్ 2 వస్తుంది అనుకొంటే.. కార్తీక దీపమే సరికొత్తగా మీ ముందుకు వస్తుందని ప్రకటించారు మేకర్స్. ఏంటి నిజమా.. అంటే అవును.. నిజమే కార్తీక దీపం.. ఇది నవవసంతం అనే పేరుతో సరికొత్తగా రాబోతుంది. పాత్రలు అవే.. కథ కొత్తది.
తాజాగా కార్తీక దీపం ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. దీప, డాక్టర్ బాబు ల పెద్ద కూతురు శౌర్య చిన్నప్పటి కథగా ఈ సీరియల్ తెరకెక్కిందని తెలుస్తోంది. శౌర్యకు తండ్రి లేడు. వంటలక్కనే శౌర్యకు తల్లి, తండ్రి అయ్యి పెంచుతుంది. అయితే ఇక్కడ డాక్టర్ బాబు కాస్తా బాబుగారుగా మారాడు. వాళ్లింట్లోనే వంటలక్క పనిచేస్తోంది. కానీ వారిద్దరూ ఒకరికి ఒకరు తెలియనట్లుగానే కనిపించారు. డాక్టర్ బాబును.. వంటలక్క బాబుగారు అని పిలుస్తుంది. మరి వీరిద్దరి మధ్య దూరం ఎందుకు వచ్చింది. శౌర్యకు తండ్రిఎవరు .. ? అనేది సీరియల్ చుస్తే కానీ తెలియదు. ప్రస్తుతం ఈ సీరియల్ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ప్రోమో చూసినవారు వంటలక్క మళ్లీ వచ్చింది.. ఫ్యాన్స్ ఎక్కడున్నా రావాలమ్మా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
