NTV Telugu Site icon

Archana Ananth: ‘కార్తీక దీపం’ సౌందర్య ముసలోడితో ప్రేమాయణం.. ఇదుగో సాక్ష్యం..?

Archana

Archana

Archana Ananth: ప్రస్తుతం సీరియల్ నటీమణులు కూడా హీరోయిన్లలా ఫేమస్ అయిపోతున్నారు. ఒక సీరియల్ కొద్దిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలు అందులో నటించిన వారి గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలతో పాటు యువత కూడా చూస్తున్న సెరియల్ కార్తీక దీపం. వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత, సౌందర్య ఈ పాత్రలు తెలియని సీరియల్ లవర్స్ ఉండరు. ఇక ఇందులో కార్తీక్ తల్లిగా సౌందర్య పాత్రలో నటించి మెప్పించిన నటి అర్చన అనంత్. మోడ్రన్ అమ్మలకు బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే అర్చన ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే ఆమె గురించి ఒక వార్త గత కొన్నిరోజులుగా నెట్టింట వైరల్ గా మారింది. ఆమె భర్తను వదిలి ఒక వృద్ధుడితో ప్రేమాయణం నడుపుతుందని, ప్రస్తుతం వారిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ వార్తలో నిజం ఉందని ఈ వీడియో చూస్తే తెలుస్తుందని చెప్పుకొస్తున్నారు మరికొంతమంది నెటిజన్స్.

బుల్లితెర నటుడు అమర్ దీప్, నటి తేజస్వని వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెల్సిందే. వీరి రిసెప్షన్ ఈ మధ్యనే ఘనంగా జరిగింది. ఇక వీరి రిసెప్షన్ కు అర్చన ఒక పెద్దాయన తో పాటు వచ్చింది. వారి కూడా అర్చన బాబు కూడా ఉన్నాడు. అయితే ఆ వృద్ధుడితోనే అర్చన ఉంటుందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఆయన వయసు దాదాపు 60 కి పైబడి ఉన్నాయి. కన్నడ సీనియర్ నటుడని చెప్పుకొస్తున్నారు. కాగా, జంటగా వెళ్లిన ఈ జంట నూతన జంటను ఆశీర్వదించింది. ఇక నిజంగా ఆయనతోనే అర్చన ఉంటుందా..? ఆ వృద్ధుడు అర్చనకు ఏమవుతారు..? అనేది తెలియదు. ఒకవేళ అర్చన కుటుంబ సభ్యులు ఎవరైనా కావొచ్చుగా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా అర్చన ఎవరితో రిలేషన్ లో ఉంది అనేది మాత్రం మిస్టరీగా ఉందని చెప్పుకొస్తున్నారు.

Show comments