విజనరీ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో “RC15” రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “RC15″ కథ శంకర్ ది కాదట ! ఈ విషయాన్ని టాలెంటెడ్ యువ తమిళ చిత్రనిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ వెల్లడించారు.”RC15” కోసం కథను రాసింది తానేనని తెలిపారు. కార్తీక్ తన ఇటీవలి ఇంటర్వ్యూలో “అవును RC15 కథ రాసింది నేనే. శంకర్ సార్ నా దగ్గర కథ తీసుకుని తనదైన శైలిలో డెవలప్ చేశారు. నేను ప్రాజెక్ట్ గురించి ఎగ్జైట్‌గా ఉన్నాను” అని చెప్పాడు. ఇక ఈ సినిమా పొలిటికల్ డ్రామా అని కార్తీక్ సుబ్బరాజ్ చెప్పుకొచ్చారు. అయితే కార్తీక్ సుబ్బరాజ్ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడు కూడా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవ్వడం సినిమాపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది.
Read Also : ఈ వారం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ జాతర
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను “ఆర్సి15” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ సోషల్ డ్రామాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. 2023 సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కరోనా కారణంగా సినిమాల విడుదల వాయిదా పడి, అటూ ఇటూ మారుతున్న విషయం తెలిసిందే. కానీ “RC15” మాత్రం అనుకున్న సమయానికే విడుదల అవుతున్న విషయాన్నీ కొన్ని రోజుల క్రితం దిల్ రాజు ప్రకటించారు.
