పాన్ ఇండియా స్థాయిలో తెలుగు దర్శకులు చూపిస్తున్న విజన్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడు అదే జాబితాలోకి యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కూడా చేరుతున్నారు. తేజ సజ్జా హీరోగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘మిరాయ్’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంలో, కార్తీక్ హైదరాబాద్‌లో మీడియాతో తన అనుభవాలు పంచుకున్నారు.
Also Read : Chiranjeevi : కార్మికుల సమ్మెతో ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్ డిలే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
“ఓ పెద్ద కలతో, లక్ష్యంతో ఈ ప్రయాణం మొదలెట్టాం. కానీ ఆ కలను చేరుకోవడం అంత సులభం కాదు. బయటకు నేను ఎప్పుడూ బలంగా కనిపించిన… లోపల మాత్రం సన్నివేశం అంచనాలకి సరిపోతుందా? అనే సందేహం వెంటాడేది. ముఖ్యంగా శ్రీలంకలో ట్రైన్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి వెళ్లేటప్పుడు చాలా టెన్షన్ అనిపించింది. కానీ ఆశ్చర్యకరంగా ప్రతీ సీన్ మా ఊహలకు మించి వచ్చింది. మాకు ఏ సంబంధం లేని ఎన్నో మంది మనుషులు ఈ సినిమా కోసం సాయం చేశారు. అది ఒక దైవశక్తి, లేదా తెలియని వారి దీవెనలే కావచ్చు. అందుకే ట్రైలర్‌లో కూడా ‘ఎక్స్‌పీరియన్స్ పవర్ ఆఫ్ బ్రహ్మాండ…’ అని పెట్టాం. మంచు పర్వతాలు, ఎడారులు, అడవుల్లో చిత్రీకరణ చేశాం. వంద రోజులకు పైగా షూట్ చేశాం. వాటిలో దాదాపు 70 రోజులు సెట్‌లో ఒక్క కార్‌వ్యాన్ కూడా లేకుండా చిత్రీకరించాం. పెద్ద పెద్ద నటులు కూడా ఆ కష్టాన్ని భరించి, మాతో కలిసి పనిచేశారు. ఈ సినిమాకి నిజంగా అన్నీ కుదిరాయి” అని భావోద్వేగంతో చెప్పారు కార్తీక్.
