NTV Telugu Site icon

Bollywood: నాలుగేళ్ల తర్వాత మళ్లీ కలిసిన బాలీవుడ్ ప్రేమ జంట…

Bollywood

Bollywood

కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలు ప్రేమ పెళ్లి అయిపోయి 24 గంటలు కూడా గడవక ముందే మరో బాలీవుడ్ ప్రేమజంట కలిసి కనిపించారు. బాలీవుడ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ లు నాలుగేళ్ల క్రితం ‘లవ్ ఆజ్ కల్’ సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో సారా, కార్తీక్ ఆర్యన్ లు రిలేషన్షిప్ లోకి వెళ్లారు అనే టాక్ బీటౌన్ లో వినిపించింది. దీంతో బాలీవుడ్ లో సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ లు హాట్ టాపిక్ అయ్యారు. ఈ మూవీ తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు కానీ ప్రేమ వార్తలు మాత్రం ఆగలేదు. కార్తీక్ ఆర్యన్ స్వయంగా తాను రిలేషన్ లో లేనని, సారా తన ఫ్రెండ్ మాత్రమే అని ఓపెన్ గానే చెప్పాడు కానీ ఎవరూ నమ్మలేదు.

కార్తీక్ ఆర్యన్ ఈ మాట చెప్పిన తర్వాత సారాతో కలిసి వెకేషన్ కి వెళ్లడంతో ‘వీ ఆర్ జస్ట్ ఫ్రండ్స్’ అనే మాటని అందరూ కొట్టి పడేశారు. ఈ వార్తలు ఎక్కువ అయ్యాయి అనో లేక ఎవరి కెరీర్స్ లో వాళ్లు బిజీగా ఉన్నారో తెలియదు కానీ సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ కలిసి కనిపించడం మానేసారు. మళ్లీ ఇప్పుడు సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ ఉదైపూర్ లో కలిసి కనిపించారు. ఈ సమయంలో పాపరాజ్జి తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మళ్లీ ప్రేమ వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం #sartik అనే ట్యాగ్ ని ట్రెండ్ క్రియేట్ చేసి మరీ ఒక రేంజులో ట్వీట్స్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఈ జంట రిలేషన్ లో ఉన్నారా? లేదా? అంటే ఏమో గుర్రం ఎగరావచ్చు అంటున్నారు బీటౌన్ వర్గాలు.

Show comments