Karthi: రోలెక్స్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ,అను ఇమ్మాన్యుయేల్ జంటగా జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన హైస్ట్ థ్రిల్లర్ జపాన్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జపాన్ దీపావళి కానుకగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ తో కార్తీ బిజీగా మారాడు. ఈ నేపథ్యంలోనే కార్తీ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నాడు.
జపాన్ ట్రూ స్టొరీ కాదు. కానీ వాస్తవ సంఘటనలు స్ఫూర్తి వుంటుంది. ఈ చిత్ర దర్శకుడు రాజు మురుగన్ రిపోర్టర్ నుంచి డైరెక్టర్ అయ్యాడు. ఆయన చూసిన అనుభవాలు కూడా ఇందులో వున్నాయి. జోకర్ సినిమాకి ఆయనకు నేషనల్ అవార్డ్ వచ్చింది. జపాన్ లో మరో కొత్తకోణం ఆవిష్కరించాడు. సినిమా చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఇదే అవుట్ అఫ్ ది బాక్స్ మూవీ అనిపించింది. ఇందులో ప్రతి సన్నివేశం చాలా కొత్తగా ఒరిజినల్ గా వుంటుంది. అయితే జపాన్ అనే పేరు ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్ధమౌతుంది. జపాన్ డార్క్ కామెడీ సినిమా.. ఊపిరి సినిమాకి తమిళ వెర్షన్ డైలాగులు రాసింది ఆయనే. అప్పుడే ఆయన హ్యుమర్ చూసి షాక్ అయ్యాను. ఇందులో ఆ హ్యుమర్ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇస్తుంది. చాలా రోజుల తర్వాత మాస్ తో పాటు హ్యుమర్ సెటైర్ వున్న డిఫరెంట్ రోల్ ఇందులో చేశాను.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
జపాన్ పాత్ర నాకు చాలా నచ్చింది. అంతకు ముందు రాజు మురగన్ నాకోసం ఒక కథ రాస్తే.. ఆ కథలో ఉన్న ఒక పాత్రే జపాన్. అది నాకు నచ్చి .. దానిమీదనే పూర్తీ సినిమా ఉంటే బావుండు అని చెప్పా .. ఆయన అదే చేశారు. ఈ పాత్ర చాలా యూనిక్ గా వుంటుందని నాకు ముందే తెలుసు. ఈ పాత్ర కు కొత్త కార్తి కావాలి. దానికి తగ్గట్టే నన్ను నేను మార్చుకున్నాను. డబ్బింగ్ చెప్పినప్పుడు .. కార్తి వినిపిస్తున్నడు జపాన్ కావాలని అడిగారు దర్శకుడు. కొంతమంది పర్సనాలిటీకి వాళ్ళ వాయిస్ కి సంబంధం వుండదు. మనిషి దృడంగా వుంటారు కానీ వాయిస్ కాస్త లేతగా సన్నగా వుంటుంది. జపాన్ పాత్ర కోసం అలా ప్రయత్నించాం. అది అద్భుతంగా కుదిరింది. జపాన్ క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. ఈ పాత్ర చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.
ఇక ఖైదీ 2 ఎప్పుడు ? రోలెక్స్ లో పాత్ర ఎలా వుంటుంది అని అందరు అడుగుతున్నారు. దాని కోసం నేనూ వెయిటింగ్ చర్చలు జరుగుతున్నాయి. రోలెక్స్ గురించి ప్రేక్షకుల్లో చాలా అంచనాలు వున్నాయి. దీని గురించి సూర్య అన్నయ్యను, దర్శకుడు లోకేష్ కనకరాజ్ ని అడగాలి.. జపాన్ చాలా బలమైన, ఆసక్తికరమైన పాత్ర.. దీనికి సీక్వెల్, ప్రీక్వెల్ ఎదో ఒకటివుండాలని క్లైమాక్స్ కి ముందే దర్శకుడితో చెప్పాను. జపాన్ పాత్రని మళ్ళీ చేయాలని వుంది” అని చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!