Site icon NTV Telugu

Japan: దీపావళికి థియేటర్స్ లోకి ‘జపాన్’

Karthi Japan Deepavali

Karthi Japan Deepavali

Karthi Japan Movie to be Released for Deepavali: కార్తి హీరోగా కేవలం తమిళ వారికే కాదు తెలుగు వారికి కూడా సుపరిచితమే. ఆయన హీరోగా నటించిన అనేక సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవడంతో ఆయనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు అయితే ఆయన హీరోగా నటిస్తున్న అన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ‘జపాన్’ అనే సినిమా చేస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Leo: హైదరాబాదులో లియో ఈవెంట్.. విజయ్ వస్తాడా?

ఇప్పటికే విడుదల చేసిన జపాన్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రాగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ని దీపావళికి విడుదల చేస్తున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఈ రిలీజ్ పోస్టర్ లో కార్తి ఒక చేతిలో గన్ తో మరో చేతిలో గ్లోబ్ తో స్టన్నింగ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక మేకర్స్ తర్వలోనే టీజర్ ని విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తోండగా సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ తొలిసారిగా నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ వినేష్ బంగ్లాన్ జపాన్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

Exit mobile version