NTV Telugu Site icon

Karthi: ఏందీ కార్తీ అన్నా.. జపాన్ అస్సామేనా..?

Japan

Japan

Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. ఆవారా నుంచి ఖైదీ వరకు తెలుగు ప్రేక్షకులను కార్తీ అలరించాడు. ఇక ఖైదీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కార్తీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజు మురుగన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక నేడు ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి భారీ నిరాశను మిగిల్చిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఒకదొంగతనం జరగడం ఆ దొంగతనాన్ని ట్రేస్ చేసి రికవరీ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేయడం అనే పాయింట్ మీద జపాన్ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్.

K. Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు..

ఇక ఇందులో కార్తీ క్యారెక్టర్ తప్ప వేరే ఏ క్యారెక్టర్ అంతగా ఇంపాక్ట్ కలిగించలేదని అభిమానులు తెలుపుతున్నారు. ఇక పాజిటివ్ అంశం ఏదైనా ఉంది అంటే.. హీరో కార్తీ పాత్ర..దాన్ని మలిచిన తీరు..అది తెర మీదకు తీసుకువచ్చిన వైనం కోసం సినిమాను చూడొచ్చు అని చెప్పుకొచ్చనా.. కథ, కథనం మాత్రం అంత లేదని అంటున్నారు. కార్తీ కోసం సినిమాకు వెళ్ళినా.. కానీ, అంతసేపు కథలేకుండా చూడడం కష్టమని అంటున్నారు. ఇక అను ఇమ్మానుయేల్ పాత్ర అయితే అస్సలు ఏం లేదని, కథను మాత్రం సరిగ్గా చూపించలేకపోయారని అంటున్నారు. దీంతో కార్తీ.. జపాన్ లాంటి కథను ఎంచుకోవడం బాగోలేదని.. ఏందీ కార్తీ అన్నా.. జపాన్ అస్సామేనా..? అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా కలక్షన్స్ ఎలా ఉండనున్నాయో చూడాలి.