Site icon NTV Telugu

RRR Pre Release Event : గెస్ట్ ఎవరో రివీల్ చేసిన జక్కన్న

rajamouli

RRR Pre Release Event నేడు కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ టీం కర్ణాటకలో ల్యాండ్ అయ్యింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ముందుగానే ప్రకటించిన మేకర్స్ ఈ వేడుకకు ముఖ్య అతిథి ఎవరన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారమే నిజమైంది ఇప్పుడు. స్వయంగా రాజమౌళి ఈ వేడుకకు అతిథి ఎవరన్న విషయాన్ని తాజాగా వెల్లడించారు.

Read Also : Sitara : మిమ్మల్ని గర్వపడేలా చేస్తా నాన్నా…

చిక్కబల్లాపూర్ లో జరగననున్న వేడుక గురించి మాట్లాడిన రాజమౌళి “నిన్న లేట్ నైట్ దుబాయ్ నుంచి బెంగుళూరులో ల్యాండ్ అయ్యాము. అయినప్పటికీ వెంకట్ గారు, ఆయన కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి హృదయపూర్వక వెల్కమ్ లభించింది. చాలా సంవత్సరాల తరువాత మిమ్మల్ని కలుస్తున్నాము. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఈవెంట్ ఎలా ? అని టెన్షన్ పడ్డాను. కానీ వెంకట్ గారు మీరు క్రియేటివ్స్ చూసుకోండి… నేను ఏర్పాట్లు చూసుకుంటాను అన్నారు. ఇక ఈరోజు వేడుకకు సీఎం వస్తున్నారు. ఫుల్ ప్రోటోకాల్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి… మీ అరుపులు, కేకల కోసం వెయిటింగ్” అంటూ ఎగ్జైట్ అయ్యారు రాజమౌళి.

Exit mobile version