Kareena Kapoor: బాలీవుడ్ అందాల భామ, స్టార్ హీరో భార్య, ఖాన్ కుటుంబానికి మకుటం లేని మహారాణి కరీనా కపూర్. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా కూడా కరీనా గురించి తెలియని వారు తెలుగులో లేరు. ఇక స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ ను వివాహమాడిన ఈ భామ ప్రస్తుతం సినిమాలు తగ్గించి.. కుటుంబాన్ని చూసుకొంటుంది. అయితే పెళ్లికి ముందు కరీనా ప్రేమ బాగోతాల గురించి కూడా అందరికి తెల్సిందే. ముఖ్యంగా షాహిద్ కపూర్ తో అమ్మడి ప్రేమాయణం ఇప్పటికి హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో వారు ఆ రేంజ్ లో మీడియా ముందు కనిపించేవారు. ముఖ్యంగా వీరిద్దరి ఎంఎంఎస్ వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Leo Movie: వివాదాలను పట్టించుకోకుండా ఎట్టకేలకు ఆ పని కానిచ్చేశారు..
2004 లో షాహిద్, కరీనా పబ్లిక్ గా లిప్ కిస్ పెట్టుకున్న వీడియో ఒకటి లీక్ అయ్యి ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే ఆ వీడియో వలన తన జీవితం నాశనమయ్యిందని షాహిద్ చెప్పుకొచ్చాడు. ఇంకా చెప్పాలంటే.. హీరోగా కన్నా.. ఆ వీడియో లీక్ అయ్యాకనే షాహిద్ పేరు బాగా వినిపించింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ ఘటనపై షాహిద్ స్పందించాడు. “MMS క్లిప్ పబ్లిక్ లోకి వచ్చాక నేను నాశనం అయ్యాను. నేను 24 ఏళ్ల పిల్లవాడిని..నా గోప్యత పై దాడి జరిగినట్లు భావించాను. నన్ను నేను రక్షించుకోవడానికి నేను ఏమీ చేయలేకపోయాను.. ఆ ఘటన నన్ను ఎంతో గందగోళానికి నెట్టింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
