పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిన విషయం విదితమే.. బాలీవుడ్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ ను ఫినిష్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక ఈ రెండిటి తరువాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ లో నటించనున్నాడు. ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టిన సందీప్ .. ప్రభాస్ సరసన ఏ హీరోయిన్ బావుంటుందో అని ఆలోచిస్తున్నాడట.. అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ను తీసుకొనే ఆలోచనలో సందీప్ ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.
కరీనా సైఫ్ అలీఖాన్ భార్య అన్న విషయం విదితమే.. ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ లో సైఫ్ అలీఖాన్ రావణాసురుడు గా కనిపిస్తున్న సంగతి తెల్సిందే. స్పిరిట్ కోసం కరీనాను ఇప్పటికే సందీప్ సంప్రదించాడని, ఆమె త్వరలో ఒక నిర్ణయం చెప్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ కరీనా కనుక ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంటే.. తెలుగులో ఇదే ఆమె మొదటి సినిమా అవుతోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సందీప్ సెలక్షన్ బాలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరీనా వయసు ఎక్కడ.. ప్రభాస్ వయస్సు ఎక్కడ.. ప్రభాస్ సరసన కరీనా అక్కలా కనిపిస్తోందని, వేరే హీరోయిన్ ను తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. మరి సందీప్ ఈ వార్తలపై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.