Kareena Kapoor Gives Clarity On Prabhas Spirit Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా లైన్‌లో పెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘స్పిరిట్’ ఒకటి. అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత.. ఇందులో కథానాయిక పాత్రకు బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ని ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. ఈ న్యూస్‌ని అప్పట్లో ఎవ్వరూ ఖండించకపోవడంతో.. అది నిజమేనేమోనని అంతా అనుకున్నారు. వెండితెరపై ప్రభాస్, కరీనాల జోడీని చూడబోతున్నామని ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు. కానీ.. ఈ వార్తల్లో నిజం లేదని తాజాగా కరీనా బాంబ్ పేల్చింది. తాను స్పిరిట్ సినిమాలో నటించడం లేదని, అసలు తనను ఆ చిత్రబృందం నుంచి ఎవరూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది. అయితే.. తనకు ప్రభాస్‌తో జోడీ కట్టే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తానని, ఆ సువర్ణవకాశం కోసం తాను వేచి చూస్తున్నానని పేర్కొంది. సో.. ఇప్పటికైతే స్పిరిట్‌లో హీరోయిన్ కరీనా కాదని తేలిపోయింది. మరి, ఆ ఛాన్స్ ఎవర్ని వరిస్తుందో? చూడాలి.
ఇకపోతే.. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే చిత్రీకరణల్లో పాల్గొంటున్నాడు. ఆదిపురుష్ షూటింగ్ ఆల్రెడీ ముగియగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఈ సినిమా జాప్యమవుతూ వస్తోంది. అయితే.. దర్శకుడు మాత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన కచ్ఛితంగా ‘ఆదిపురుష్’ని రిలీజ్ చేస్తామని చెప్పాడు. ఇక సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు సైతం వచ్చే ఏడాదిలోనే రానున్నాయి. అటు.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమా షూట్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో రణ్‌బీర్ కపూర్, రశ్మికా మందణ్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ముగిసిన తర్వాత.. ప్రభాస్ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు సందీప్ రెడ్డి. కాకపోతే, ఇది ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్లనున్నదే ఇంకా మిస్టరీగా ఉంది.
