Site icon NTV Telugu

Karate Kalyani: కరాటే కళ్యాణిపై దాడి.. చున్నీ లాగేసిన దుండగులు

Karate Kalyani

Karate Kalyani

నటిగా ఒకప్పుడు పలు సినిమాల్లో నటించిన కరాటే కళ్యాణి, ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అనేక అంశాల మీద స్పందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా హిందుత్వవాదిగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ, హిందూ సంఘాల మీద లేదా హిందూ దేవీదేవతల మీద ఎవరు కామెంట్ చేసినా ఆమె సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడడమే కాదు, పోలీస్ కేసుల వరకు వెళ్తున్నారు. తాజాగా ఆమె మీద దాడికి యత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆదిభట్ల వండర్లా దగ్గర ఇద్దరు నిందితులు లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తూ ఉండగా, పంజాగుట్ట పోలీసుల సహాయంతో ఆ ఇద్దరు నిందితులను కరాటే కళ్యాణి పట్టుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి వీరిద్దరూ లక్కీ డ్రా పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం ముందు వీడియో చేసి పోస్ట్ చేశారు. ఒక ఫార్చ్యూనర్ కారు లక్కీ డ్రా తీస్తున్నామని, గెలిచిన వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కూడా చేయిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు.

Also Read: Vk Naresh: వరుస సినిమాలు.. నరేష్ క్రేజ్ మాములుగా లేదుగా!

ఈ విషయం మీద ఇప్పటికే హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే వీరిపై కరాటే కళ్యాణి కేసు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. వారు ఆదిభట్ల వద్ద ప్రచారం చేస్తున్న సంగతి తెలుసుకొని వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా, కరాటే కళ్యాణి మీదకు దూసుకువచ్చిన నిందితులు ఆమె చున్నీ కూడా లాగినట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో లక్కీ డ్రా పేరుతో అనేకమంది కార్లు, హౌసింగ్ ప్లాట్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయం మీద ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా స్పందించారు.

Exit mobile version