Site icon NTV Telugu

KGF Chapter 2 : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హోస్ట్ గా టాప్ ప్రొడ్యూసర్

KGF-2

KGF Chapter 2 trailer launch event కోసం ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తోంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఎట్టకేలకు విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి KGF Chapter 2 రిలీజ్ పై పడింది. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ బహుభాషా చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. హోంబాలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించింది. రవి బస్రూర్ సంగీతం అందించగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు KGF Chapter 2 సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ను షేర్ చేశారు మేకర్స్.

Read Also : Hridayam : కరణ్ జోహార్ చేతుల్లో మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ రైట్స్

KGF Chapter 2 trailer launch event గ్రాండ్ గా జరపడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ ను ఓ స్టార్ ప్రొడ్యూసర్ హోస్ట్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. మార్చ్ 27న జరగనున్న KGF Chapter 2 trailer launch eventను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసిన టీం సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు వేడుక జరగనున్నట్టుగా వెల్లడించారు. ఈ ఈవెంట్ కు శాండిల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గెస్ట్ గా విచ్చేయనున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version