Site icon NTV Telugu

Karan Johar: ట్విటర్‌కు గుడ్‌బై చెప్పేసిన కరణ్ జోహార్.. కారణమిదే!

Karan Quits Twitter

Karan Quits Twitter

Karan Johar Quits Twitter And Deletes His Account: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సెలెబ్రిటీల్లో.. బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఒకరు. ఈయన తన సినిమాలకు సంబంధించిన వివరాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంటాడు. అప్పుడప్పుడు వివాదాస్పద అంశాలపై కూడా తన అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తుంటాడు. అలాంటి కరణ్ ఇప్పుడు ట్విటర్‌కి గుడ్ బై చెప్పేశాడు. తన ఖాతాను డిలీట్ చేసేశాడు. దీంతో.. ఎందుకు కరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు? అసలేం జరిగింది? అనే అంశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కరణ్ చేసిన చివరి ట్వీట్‌ని బట్టి, తనపై వస్తున్న ట్రోల్స్ నుంచి ఉపశమనం పొందేందుకే అతడు ట్విటర్‌కి గుడ్‌బై చెప్పినట్టు స్పష్టమవుతోంది.

సాధారణంగానే కరణ్ జోహార్‌పై ట్రోల్స్, విమర్శలనేవి వస్తుంటాయి. అయితే.. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన తర్వాత ఆ ట్రోల్స్, విమర్శలు మరింత పెరిగిపోయాయి. ఇండస్ట్రీలో ఏ ఇష్యూ జరిగినా సరే, ట్రోలర్స్ ప్రధానంగా కరణ్ జోహర్‌నే టార్గెట్ చేస్తారు. మొన్న బాయ్‌కాట్ ట్రెండ్ సమయంలో కూడా అతనిపై తారాస్థాయిలో విమర్శలు ఎక్కువపెట్టారు. బాలీవుడ్ అతని వల్లే నాశనం అవుతోందంటూ తిట్టిపోశారు. ఇలా తన మీద నిత్యం వస్తోన్న విమర్శలకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే.. కరణ్ ట్విటర్‌కు గుడ్‌బై చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకీ.. అతను చివరగా చేసిన ట్వీట్ ఏంటో తెలుసా? ‘‘పాజిటివ్ ఎనర్జీ, ప్రశాంతత కోసం కాస్త విరామం తీసుకోవాలనుకుంటోన్నా. అందులో భాగమే ఈ తొలి అడుగు. గుడ్‌బై ట్విటర్’’. ఇదే కరణ్ చేసిన చివరి ట్వీట్.

కరణ్ ఆ ట్వీట్ చేయడమే ఆలస్యం.. నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వెల్లడించడం మొదలుపెట్టారు. ‘సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కంటే ప్రశాంతత ఎంతో ముఖ్యం, మంచి నిర్ణయం తీసుకున్నారు’ అంటూ ఓ రీట్వీట్లు చేశారు. కాసేపయ్యాక కరణ్ తన ఖాతాను డిలీట్ చేశాడు. మరి, ఇతడు శాశ్వతంగా గుడ్‌బై చెప్పాడా? లేక కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తాడా? అనేది వేచి చూడాలి.

Exit mobile version