Site icon NTV Telugu

Anil Ravipudi: స్టార్ డైరెక్టర్ లాంచ్ చేసిన ‘కరణ్ అర్జున్’ ట్రైలర్!

Anil Ravipudi

Anil Ravipudi

రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `క‌ర‌ణ్ అర్జున్‌`. మోహ‌న్ శ్రీవ‌త్స ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డా. సోమేశ్వ‌ర‌రావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్ , రామకృష్ణ , క్రాంతి కిరణ్ నిర్మాత‌లు. ఈ మూవీ ట్రైలర్ ను గురువారం స‌క్సెస్ ఫుల్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ…” ‘క‌ర‌ణ్ అర్జున్‌’ ట్రైల‌ర్ చాలా బావుంది. విజువ‌ల్స్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఒక యంగ్ టీమ్ ఎంతో రిస్క్ చేసి పాకిస్థాన్ బార్డ‌ర్ లో షూటింగ్ చేశారు. ట్రైల‌ర్ లాగే సినిమా కూడా బావుంటుంద‌ని ఆశిస్తూ… టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలియ‌జేస్తున్నాను” అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్ శ్రీవ‌త్స మాట్లాడుతూ, ”’ఎఫ్ 3′ ప్ర‌మోష‌న్స్ లో బిజీ గా ఉన్నా కూడా మాకు టైమ్ ఇచ్చి మా ‘క‌ర‌ణ్ అర్జున్’ మూవీ ట్రైల‌ర్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి గారికి ధ‌న్య‌వాదాలు. మూడు పాత్ర‌ల‌తో రోడ్ థ్రిల్ల‌ర్ గా ఈ చిత్రాన్నితెర‌కెక్కించాం. పాకిస్థాన్ బార్డ‌ర్ లో ఎంతో రిస్క్ చేసి షూటింగ్ చేశాం. ప్ర‌తి స‌న్నివేశం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఉంటూ థియేట‌ర్ లో ఆడియ‌న్స్ ని ఎంట‌ర్ టైన్ చేస్తుంది. కంటెంట్ ని న‌మ్ముకుని చేసిన సినిమా ఇది” అని అన్నారు. అతి త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని నిర్మాతల్లో ఒకరైన బాలకృష్ణ ఆకుల తెలిపారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవల దర్శకుడు పరశురామ్ ఆవిష్కరించారని, ఇప్పుడు ట్రైలర్ ను అనిల్ రావిపూడి రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి మేకల అన్నారు.

Exit mobile version