NTV Telugu Site icon

Scientific mystery thriller: ‘కరాళ’గా రాబోతున్న కన్నడ ‘బీగా’!

Karala123

Karala123

Karala: రవిశంకర్, జాది ఆకాశ్, సయ్యద్ ఇర్ఫాన్, సుమితా బజాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమా ‘బీగా’. ఈ కన్నడ చిత్రాన్ని తెలుగులో ‘కరాళ’ పేరుతో అనువదించి, విడుదల చేయబోతున్నారు. కన్నడ మాతృక ఈ నెల 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తెలుగు వర్షన్ ట్రైలర్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ”దర్శకుడు సాగర్ శిష్యుడు శ్రీనందన్. ఆయన తెరకెక్కించిన ఈ సినిమాలో రవిశంకర్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఉన్నారంటే ఆ సినిమా గ్రాండ్ గానే ఉంటుంది. ఇది కూడా అలాంటి చిత్రమే అని ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది” అని అన్నారు.

Read Also: Nakka Anandbabu:టీడీపీపై ఎన్నికేసులు పెడతారో పెట్టండి

తెలుగులో ఈ సినిమాను శ్రీ లక్ష్మీ పిక్చర్స్ అధినేత బాపిరాజు విడుదల చేస్తున్నారని, ఆయన పక్కా ప్లానింగ్ ఉన్న పంపిణీదారుడని నిర్మాతల మండలి కోశాధికారి తుమ్మలపల్లి రామ సత్యనారాయణ చెప్పారు. ఈ సినిమాలో తాను ఓ మంచి వేషం వేశానని, తనకిది తొలి కన్నడ చిత్రమని ‘జబర్దస్త్’ ఫేమ్ నవీన్ తెలిపాడు. ఈ సినిమాలో మూడు పాటలున్నాయని, నేపథ్య సంగీతం కొత్తగా ఉంటుందని సంగీత దర్శకుడు శ్రీగురు అన్నారు. ఈ సినిమా కథ, కథనం ఆకట్టుకుంటాయని నటుడు జాది ఆకాశ్ చెప్పాడు. ఇదో సైంటిఫిక్ మిస్టరీ చిత్రమని, ప్రేక్షకుల ఊహించని ట్విస్టులు ఉంటాయని, యాక్షన్ కూ పెద్ద పీట వేశామని దర్శకుడు శ్రీనందన్ తెలిపారు. నిర్మాత బోదాసు నర్సింహా మాట్లాడుతూ “నాకు సినిమా అంటే తెలీదు. దర్శకుడు శ్రీనందన్ మంచి కథ చెప్పాడు. బాగా నచ్చింది. వెంటనే సినిమా చేద్దామని చెప్పాను. నా మిత్రుడు పిట్ల భాస్కర్ సహా నిర్మాతగా చాలా హెల్ప్ చేసాడు. ఈ ‘కరాళ’ చిత్రం చాలా గొప్పగా వచ్చింది. తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నాం. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం” అని అన్నారు.