Kantara: కాంతార.. ఈ ఏడాది వచ్చిన టాప్ బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటి. కానంద హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ. 400 కోట్లు వసూళ్లు చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషబ్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ ఒక్క సినిమాతో రిషబ్ పేరు దేశం మొత్తం వినిపించింది. ఇంత పెద్ద హిట్ అందుకోవడంతో రిషబ్ కూడా గట్టిగానే పారితోషికం తీసుకొని ఉంటాడు అని అనుకోకుండా ఉండలేం. అయితే అందుతున్న సమాచారం ప్రకారం రిషబ్ ఈ సినిమాకు కేవలం రూ. 4 కోట్లు మాత్రమే అందుకున్నాడట.
చివరికి సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యాక కూడా తన రెమ్యూనిరేషన్ పెంచాలని కానీ, షేర్స్ లో భాగం కావలని కానీ డిమాండ్ చేయలేదట. ఇక రిషబ్ తో పాటు ఈ సినిమాలో నటించిన వారు కూడా ఒక కోటి కన్నా తక్కువే తీసుకున్నారట. హీరోయిన్ సప్తమి గౌడ, కీలక పాత్రలో ఫారెస్ట్ ఆఫీసర్ గా నటించిన కిషోర్ చెరో కోటి ఇచ్చారట. దీంతో అంత పెద్ద హిట్ అందుకున్న ఈ సినిమాకు వీరి నటనకు కొంచెం ఎక్కువ ఇచ్చినా పర్లేదు. కనీసం హిట్ అయ్యాక అయినా మేకర్స్, రిషబ్ కు ఒక కాస్ట్లీ గిఫ్ట్ అయినా ఇచ్చి ఉంటే బావుండేది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
