Kantara: కాంతార మొన్నటి వరకు థియేటర్లో మోత మోగిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో కూడా మోత మోగిస్తుంది. అయితే కొద్దిగా నిరాశను కూడా చవిచూపించింది. సినిమాకు హైలైట్‌గా నిలిచిన వరాహ రూపం సాంగ్ ను కట్ చేసి ఎడిట్ వెర్షన్‌తో అమెజాన్‌కు అమ్మేశారు కాంతార మేకర్స్. దీంతో కాంతార చూసినవారందరూ ఈ సినిమా మాకొద్దు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వరహరూపం పాట ట్యూన్‌ను అనుమతులు లేకుండా కాపీ కొట్టారు అంటూ కేరళకు చెందిన ఒక మ్యూజిక్ బ్యాండ్ కోర్టులో కేసు వేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. కానీ, దీనివలన నష్టపోయింది అమెజాన్ అని చెప్పొచ్చు. దీంతో మేకర్స్‌కు షాక్ ఇచ్చే నిర్ణయం అమెజాన్ తీసుకుందని టాక్ వినిపిస్తోంది.
అమెజాన్ ప్రైమ్, హోంబెల్ ఫిలిమ్స్‌కు కోత విధించినట్లు తెలుస్తోంది. అమెజాన్ కాంతార సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసిందట. సినిమాలో అసలైన కంటెంట్ లేకపోవడంతో 25% వరకు ఓటీటీ డీల్‌లో పేమెంట్ తగ్గించినట్లుగా చెప్పుకొస్తున్నారు. డీల్ ప్రకారం ఒరిజినల్ కంటెంట్ కాకుండా ఎడిట్ చేసి తమను మోసం చేయడంతో అమెజాన్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
