గత ఏడాది విడుదలై ప్రభంజనాన్ని సృష్టించిన సినిమా కాంతారా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కన్నడ ఇండస్ట్రీలో చిన్న గా రిలీజ్ అయిన ఈ మూవీ నేషనల్ లెవల్‌లో సంచలనాలు నమోదు చేసింది. దాదాపు భారతీయ భాషలన్నింటిలోనూ సూపర్ హిట్ కావటంతో ఈ సీక్వెల్‌కు సంబంధించిన చర్చ మొదలైంది.. అనుకున్నట్లుగానే సీక్వెల్ సినిమా ఉన్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు..
మొదటి పార్ట్ భారీ హిట్ ను అందుకోవడంతో సీక్వెల్ కోసం భారీ బడ్జెట్ కేటాయించారట మేకర్స్. కన్నడ రూట్స్‌కు సంబంధించిన కథతో తెరకెక్కిన కాంతార నేషనల్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది.. ఈ సినిమాకు సీక్వెల్ కావాలని చాలా మంది అభిమానులు రిక్వెస్ట్ కూడా చేశారు.. అభిమానుల కోరిక మేరకు అన్నట్టుగా పార్ట్ 2ను ఎనౌన్స్ చేసింది యూనిట్. అందరూ ఊహించినట్టుగా సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్‌ను రాబోతుందని చెప్పి ట్విస్ట్ ఇచ్చింది టీమ్. కాంతార పాన్ ఇండియా సక్సెస్ కావటంతో మిగతా ప్రాజెక్ట్స్‌ను పక్కన పెట్టేసి ప్రీక్వెల్ మీదే దృష్టి పెట్టారు డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టి..
ఇదిలా ఉండగా.. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్ట్ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఆల్రెడీ పార్ట్ 2కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేయటంతో ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌ను లో బడ్జెట్‌లో చిన్న గా రూపొందించిన మేకర్స్, పార్ట్ 2ను మాత్రం భారీ బడ్జెట్‌తో బిగ్ స్కేల్‌లో ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..కాంతార బడ్జెట్ జస్ట్ 16 కోట్లు. కానీ ఈ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ నెంబర్స్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రీక్వెల్‌ను 120 కోట్లతో నిర్మించేందుకు రెడీ అయ్యారు.. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు కసరత్తులు చేస్తున్నారు.. 2024 సెకండ్ ఆఫ్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..