థియేటర్లలో ఘన విజయాన్ని సాధించిన ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పుడు ఓటీటీ లోకి అడుగుపెట్టింది. కానీ అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే.. ఈ సినిమా కేవలం 29 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. సాధారణంగా హిట్ సినిమాలకు నిర్మాతలు ఓటీటీ రిలీజ్‌ను వాయిదా వేయడం సర్వసాధారణం. కానీ ఈసారి మాత్రం ఆ నియమాన్ని పూర్తిగా తారుమారు చేశారు. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, అక్టోబర్ 31 నుంచి ప్రైమ్ వీడియో లో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రాబోతోంది.
Also Read : Baahubali The Epic : రీ రిలీజ్‌లోనూ బాహుబలి రికార్డు.. OR రీ రిలీజ్‌లో కూడా బాహుబలి రికార్డు..
ఇప్పటికే ‘కాంతార చాప్టర్ 1’ ప్రపంచవ్యాప్తంగా రూ. 821.5 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇంకా చాలా చోట్ల హౌస్‌ఫుల్ షోస్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇంత దూకుడు నడుస్తున్న సమయంలోనే ఓటీటీ రిలీజ్‌ను ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే దీని వెనుక కారణం నిర్మాతల కొత్త నిర్ణయం కాదు.. మూడు సంవత్సరాల క్రితం కుదిరిన ఓటీటీ ఒప్పందమే కారణమట. ఆ ఒప్పందం ప్రకారం, సినిమా విడుదలైన 4 వారాల లోపల ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయాల్సిందే. ఆ సమయంలో ఈ స్థాయి భారీ విజయం వస్తుందని ఎవరూ ఊహించలేదు.
హిందీ వెర్షన్ మాత్రం ఎప్పటిలాగే 8 వారాల తర్వాత విడుదల కానుంది. నిర్మాతల ప్రకారం, థియేటర్లలో వసూళ్లపై ఓటీటీ రిలీజ్ పెద్దగా ప్రభావం చూపదని నమ్మకం. పైగా కాంతార సిరీస్‌కి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ కారణంగా రెండు ప్లాట్‌ఫామ్‌ల్లోనూ మంచి వ్యూయర్‌షిప్ వస్తుందని వారు భావిస్తున్నారు. మొత్తం మీద, ‘కాంతార చాప్టర్ 1’ తన కథ, విజువల్స్, వసూళ్లతో పాటు ఇప్పుడు తన సుడిగాలి ఓటీటీ ఎంట్రీతో కూడా చర్చనీయాంశంగా మారింది.
