Site icon NTV Telugu

Kantara Chapter 1 : ఆ వార్తలన్నీ ఫేక్.. స్పందించిన కాంతార టీమ్..

Kantara

Kantara

Kantara Chapter 1 : ది మోస్ట్ వెయిటెడ్ మూవీ కాంతార చాప్టర్-1 గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అప్పట్లో ఓ జూనియర్ ఆర్టిస్టు చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. అతను చనిపోయింది సెట్స్ లో కాదని.. బయట అంటూ టీమ్ క్లారిటీ ఇచ్చుకుంది. తాజాగా సెట్స్ లో పడవ ప్రయాణం జరిగిందని.. 30 మంది నీటిలో గల్లంతు అయ్యారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచే ఈ వార్తలు వస్తుండటంతో తీవ్ర ఆందోళన రేకెత్తింది. తాజాగా దీనిపై మూవీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ ఆదర్శ్ స్పందించారు.

Read Also : Allu Arjun : ‘శక్తిమాన్’ గా బన్నీ.. అంతా ఉత్తదే..!

‘ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మేం మాణి నది ఒడ్డున ఓ సెట్ వేశాం. గాలికి ఆ సెట్ కాస్త డ్యామేజ్ అయింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ టైమ్ లో ఎవరూ సెట్ లో లేరు. దాన్ని రిపేర్ చేయిస్తున్నాం. ఎలాంటి పడవ ప్రమాదాలు జరగలేదు. గజ ఈతగాళ్లు, స్కూబా డైవర్స్ సమక్షంలో షూట్ చేస్తున్నాం.

కొందరు కావాలనే ఇలాంటి రూమర్స్ మాపై సృష్టిస్తున్నారు. దయచేసి అవి నమ్మొద్దు అంటూ కోరారు. రిషబ్ శెట్టి డైరెక్షన్ లో ఆయన మెయిన్ లీడ్ రోల్ లో ఈ మూవీ వస్తోంది. 2022లో వచ్చిన కాంతార మూవీకి సీక్వెల్ గా దీన్ని ప్లాన్ చేశారు. భారీ పీరియాడిక్ థ్రిల్లర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. మూవీపై భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు.

Read Also : Dil Raju : అవార్డు వస్తే ఎంత పెద్ద స్టారైనా రావాల్సిందే.. తప్పు జరిగితే క్షమించండి..

Exit mobile version