కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాంతార చాప్టర్ -1’. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాకి ఇది ప్రీక్వెల్‌గా రాబోతుండటంతోనే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం, అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్, కొద్ది రోజుల క్రితం కథానాయిక రుక్మిణి వసంత్ పాత్రను పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాత్రం మరో ఆసక్తికరమైన పాత్రను పరిచయం చేశారు.
Also Read : Bollywood : బాలీవుడ్ నుంచి AI టెక్నాలజీతో వస్తున్న ‘చిరంజీవి హనుమాన్’
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయనను ‘కులశేఖరుడు’ అనే శక్తివంతమైన పాత్రలో పరిచయం చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో ఆయన లుక్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండటంతో, ఈ సినిమాలో ఆయన ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారని అభిమానులు అంచనా వేస్తున్నారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అజ్నిష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. రిషబ్ శెట్టి ఇప్పటికే చెప్పినట్టు, ‘కాంతార చాప్టర్ 1’లో పురాణ గాథ, భక్తి, అద్భుతాలు, మానవ భావోద్వేగాలు కలగలిసిన కథ ఉండబోతోంది. కొత్తగా పరిచయం చేసిన కులశేఖరుడి పాత్రతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది.
