Kantara: జూన్ నుంచి సెట్స్ పైకి ‘కాంతార 2’… సీక్వెల్ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంతార… 2022లో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా. కన్నడలో రూపొందిన ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ, అతి తక్కువ సమయంలోనే క్లాసిక్ గా పేరు తెచ్చుకోని పాన్ ఇండియా హిట్ అయ్యింది. కన్నడ నుంచి సౌత్, అటు నుంచి నార్త్ కి వెళ్లి కాసుల వర్షం కురిపించిన కాంతార సినిమాని రిషబ్ శెట్టి అద్భుతంగా నటిస్తూ తెరకెక్కించాడు. హోమ్బెల్ ఫిల్మ్ మేకర్స్ నుంచి వచ్చిన ఈ మాస్టర్ పీస్ కి స్టార్టింగ్ పావు గంట, క్లైమాక్స్ అరగంట పంచ ప్రాణులుగా నిలిచాయి. కాంతార సినిమాని అంత గొప్పగా మార్చిన ఇంకో విషయం ‘వరాహరూపం’ సాంగ్, ఈ పాట వినీ గూస్ బంప్స్ రాని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. పర్ఫెక్ట్ క్రాఫ్ట్స్ మెన్ సినిమాగా పేరు తెచ్చుకున్న కాంతార సినిమా రిలీజ్ అయ్యి 100 రోజులు అయ్యింది. ఇండియా నుంచి ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ అయిన సినిమాల్లో కాంతారకి కు చోటు దక్కింది. దీంతో కాంతార సినిమాపై అందరి దృష్టి పడింది.
ఒక రీజనల్ సినిమాగా ప్రయాణం మొదలుపెట్టిన కాంతార సినిమాకి ఈరోజు ఇంటర్నేషనల్ రీచ్ రావడంతో చిత్ర యూనిట్ క్లౌడ్ నైన్ లో ఉన్నారు. గతంలో కాంతార సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుంది అని అడిగితే, త్వరలో చెప్తాను అని సమాధానం ఇచ్చిన రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతార 2 స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడు. కోస్టల్ కర్ణాటకలో కాంతార 2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. జూన్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని శాండల్ వుడ్ వర్గాల సమాచారం. అయితే కాంతార 2 సీక్వెల్ గా కాకుండా ప్రీక్వెల్ గా రూపొందనుందట. అంటే ఫస్ట్ పార్ట్ లో మనం చూసిన ఫస్ట్ 20 మినిట్స్ కి ముందు జరిగిన కథ(శివ తండ్రి కథ)తో కాంతార 2 తెరకెక్కనుందని సమాచారం. అయితే కాంతార సినిమాకి ప్రధాన బలం, “భూతకోల” ఈ భూతకోలని ఎలా చేస్తారు? ఎక్కడ చేస్తారు లాంటి విషయాలని ఫస్ట్ పార్ట్ లోనే బ్యూటిఫుల్ గా చూపించేశారు కాబట్టి జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ప్రీక్వెల్ లో రిషబ్ శెట్టి కొత్తగా ఏం చూపిస్తాడు అనేది ఆలోచించాల్సిన విషయమే.
Also Read
- Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోణె? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
- Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
- Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్‌డేట్.. 'బొమ్మరిల్లు' డైరెక్టర్‌తో కొత్త కాంబో?
- Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
తాజావార్తలు
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
Mercedes E53 Hybrid: మెర్సిడెస్ కొత్త కారు.. పెట్రోల్ లేకుండానే 100KM రేంజ్, 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్
-
Vietnam Boat Tragedy: నేడు భారత్‌కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
-
Vaibhav Sooryavanshi: బ్లాక్ సూట్, సన్‌గ్లాసెస్.. అదిరిపోయిన వైభవ్ లుక్.! వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెట్ త్రయం సందడి.!
-
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోణె? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!