Kannappa Teaser Released: భక్త కన్నప్ప గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కన్నప్ప తమ వాడేనని భావిస్తూ ఉంటారు. శ్రీకాళహస్తిలో జరిగినట్టుగా చెప్పుకునే కన్నప్ప చరిత్ర మీద భక్తకన్నప్ప పేరుతో కృష్ణంరాజు ఒకప్పుడు సినిమా చేశారు. తర్వాత ప్రభాస్ హీరోగా ఇలాంటి ఒక సినిమా చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఇక ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా కోసం న్యూజిలాండ్ వెళ్లి మరీ షూటింగ్ జరుపుకుని వచ్చారు. తెలుగు నటులే కాదు, కన్నడ, మలయాళ, హిందీ భాషలకు చెందిన స్టార్ యాక్టర్లతో పాటు ప్రభాస్ కూడా ఈ సినిమాలో భాగమయ్యాడు. సినిమా రిలీజ్ కి సిద్ధం చేసే క్రమంలో తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ మాత్రం అదిరిపోయేలా ఉందని చెప్పాలి. కానీ అసలు కన్నప్ప కథకు టీజర్ కి ఎక్కడ సింకు కుదరడం లేదు అనే కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఒకసారి కన్నప్ప వృత్తాంతం తెలుసుకుందాం, తర్వాత టీజర్ చూద్దాం. ఆ తర్వాత మీకేం అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి.
RK Roja: అలా అయితే సిగ్గుపడాల.. తలెత్తుకు తిరుగుదాం.. రోజా ఆసక్తికర పోస్ట్
కన్నప్ప వృత్తాంతం:
ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడి(కన్నప్ప)గా అవతరించాడని అంటారు. అర్జునునుడు ఆ జన్మలో శివసాయుజ్యం పొందలేక పోవడంతో మరో జన్మ ఎత్తాడని చెబుతారు. బోయ కులానికి చెందిన తండై, నాథనాథ దంపతులకి తిన్నడు జన్మించాడు. తండ్రితో పాటు రోజూ వేటకు వెళ్ళేవాడు. పెద్దయ్యాక ఒకరోజు వేటాడి అలసిపోయి అడవిలోనే ఓ చెట్టుకింద నిద్రపోయాడు. అలా పడుకున్న తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల రాగా తిన్నడు నిద్ర నుండి లెచేప్పటికి ఒక దుప్పి కనిపించింది. తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు అనే ప్రాంతానికి వెళ్లగా అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమివ్వగా నామీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు. శివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లూవాకిలీ మరచి అక్కడే ఉండిపోయి శివుని సేవలోనే గడపసాగాడు. అటవీ ప్రాంతం కావడం, వసతులు లేక నోటితో నీళ్ళు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసి చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తూ వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉండేవాడు. ఈ విషయం తెలిసి అదే ఊరిలో ఉన్న శివగోచార అనే భక్తుడికి ఈ తీరు నచ్చక తలను శివలింగానికి కొట్టుకుని చనిపోబోయాడు. మహాశివుడు ఇక్కడే దాక్కుని, ఏం జరగబోతోందో చూడమని అంటే పక్కనే దాక్కుంటాడు. ఎప్పటిలానే శివుడికి పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకిలా జరిగింది అని చూస్తే, శివుడి కంటిలోంచి కన్నీరు కారుతోంది, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి, రాతిమీద నూరి కంటికి కట్టు కట్టాడు. అప్పుడు రెండో కంటి నుండి రక్తం కారుతోంది. ఇక ఇలా కాదని బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చగా మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలైంది. అప్పుడు తిన్నడు శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని, ఆ కన్ను దగ్గర పెట్టి, రెండో కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు. ఇది దాక్కుని చూస్తున్న శివగోచారి షాక్ అవుతాడు. తిన్నడి అపరిమిత భక్తిప్రపత్తులకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయి రెండో కన్ను పెకిలించకుండా వారించి, కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమౌతావు, సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు..” అంటూ శివసాయుజ్యం ప్రసాదించాడని అంటారు. ఈ కధకు మీరు చూసిన టీజర్ కి ఎంతవరకు కనెక్షన్ ఉందో కింద కామెంట్ చేయండి.