Kannappa: స్పీడ్ పెంచిన కన్నప్ప.. రెండో షెడ్యూల్ మొదలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa: కొన్నేళ్లుగా మంచు విష్ణు హిట్ కోసం ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. కానీ, అది మాత్రం విష్ణుకు అందడం లేదు. దీంతో ఈసారి ఎలాగైనా వవిష్ణు మంచి విజయాన్ని అనుకోవాలని కన్నప్పతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు. కన్నప్ప సినిమాపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నారు.
న్యూజిలాండ్, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నారు. ఆల్రెడీ న్యూజిలాండ్‌లో 90 రోజుల పాటు నిర్విరామంగా ఫస్ట్ షెడ్యూల్‌ను కంటిన్యూ చేశారన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక చిత్రయూనిట్ అంతా ఇండియాకు తిరిగి వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకున్న కన్నప్ప టీం మళ్లీ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. ఈ మేరకు న్యూజిలాండ్‌లో దిగిన విష్ణు మంచు ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో మోహన్ బాబు, విష్ణు మంచు కనిపిస్తున్నారు. ఈ రెండో షెడ్యూల్‌లో ఒళ్లు గగుర్పొడిచే సీన్లను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమాతో విష్ణు హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!