Site icon NTV Telugu

Kannappa : కన్నప్ప ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Kannappa

Kannappa

Kannappa : మంచు విష్ణు హీరోగా ప్రభాస్ కీలక పాత్ర పోషించిన మూవీ కన్నప్ప. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కానీ అనుకన్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. కానీ అవార్డులు చాలానే వస్తున్నాయి ఈ సినిమాకు. ఇందులో మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించారు. అలాగే అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో, కాజల్ పార్వతి పాత్రలో కనిపించాడు. మోహన్ బాబు ఇందులో కీలక పాత్రలో మెరిశారు. ఇంత మంది స్టార్లు ఉన్నా సరే ఆశించిన స్థాయిలో థియేటర్లలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయింది.

Read Also : Ghaati : శభాష్ అనుష్క.. వాళ్లందరి నోర్లు మూయించిందిగా

తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను మంచు విష్ణు ప్రకటించారు. 4 సెప్టెంబర్ 2025న ఈ మూవీ అమేజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు విష్ణు ట్వీట్ చేశారు. ఇందుకోసం స్పెషల్ ట్వీట్ ను పంచుకున్నారు. మూవీ థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయినా.. ఓటీటీలో ఆడుతుందని మూవీ టీమ్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాను ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. భక్త కన్నప్ప జీవిత కథను ఆధారంగా చేసుకుని సినిమా వచ్చింది.

Read Also : Mirai : మిరాయ్ లో మహేశ్ బాబు.. తేజ సజ్జా షాకింగ్ కామెంట్స్

Exit mobile version