Site icon NTV Telugu

Preethi Mukundan : కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

Preethy

Preethy

Preethi Mukundan : మంచు విష్ణు హీరోగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లు కీలక పాత్రలు చేస్తున్న కన్నప్ప మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఇందులో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ నటించింది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఈమె ఎవరా అని చాలా మంది ఆరా తీస్తున్నారు. ప్రీతి ముకుందన్ ది తమిళనాడు. తిరుచ్చి జిల్లాలో జూలై 30, 2001లో ప్రీతి జన్మించింది. ఆమె పేరెంట్స్ ఇద్దరూ డాక్టర్లే. బీటెక్ చదువుకున్న ప్రీతి సినిమాలపై ఇంట్రెస్ట్ తో ఈ రంగంలోకి వచ్చింది.

Read Also : Kannappa : ట్రోల్స్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం.. కన్నప్ప టీమ్ వార్నింగ్..!

కన్నప్ప కంటే ముందు నటించిన తెలుగు సినిమా మరొకటి ఉంది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ‘ఓం భీం భుష్’ మూవీలో నటించింది. కానీ ఇందులో చేసిన ఆయేషా ఖాన్ ఎక్కువ హైలైట్ అయింది. అంతకు ముందు తమిళ్ లో కెవిన్ హీరోగా వచ్చిన ‘స్టార్’ సినిమాలోనూ ప్రీతి ముకుందన్ నటించింది. ఈ రెండు సినిమాల కంటే కన్నప్ప భారీ సినిమా కావడంతో ఆమె గురించి చర్చ జరుగుతోంది.

ఈ మూవీలో ఆమె తన గ్లామర్ ను బాగానే ఆరబోసింది. విష్ణుకు జోడీగా నటించడం.. డ్యాన్సులు, గ్లామర్ ను బాగానే చూపించడంతో ఆమె తన ట్యాలెంట్ ను చూపించింది. ఈ మూవీ గనక హిట్ అయితే ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయి. ప్రీతి ముకుందన్ అటు తమిళంలో కూడా అవకాశల కోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం.

Read Also : Kuberaa : 100 కోట్ల ‘కుబేరు’డు!

Exit mobile version