సంగీతం మీద బోర్ కొట్టిందా లేక మ్యూజిక్కే ఏం కొడతాములే అనుకున్నాడో కన్నడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య. జస్ట్ ఫర్ ఛేంజ్ అనుకుని మెగా ఫోన్‌పై మనసు పారేసుకున్నాడు. ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేసి శాండిల్ వుడ్ స్టార్ హీరోలతో ఓకే చేయించుకున్నాడు. ఫస్ట్ అటంప్ట్‌లోనే ముగ్గురు కన్నడ స్టార్ హీరోలైన శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, వర్సటైల్ యాక్టర్ రాజ్ బి శెట్టితో మల్టీస్టారర్ మూవీ 45ని పట్టాలెక్కించాడు.
Also Read : Thandel : తండేల్ పాన్ ఇండియా రిలీజ్.. కానీ అక్కడ కాస్త ఇబ్బందే
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శివన్న, ఉప్పీ కలిసి వర్క్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కబ్జాలో శివ రాజ్ కుమార్ కనిపించినప్పటికీ జస్ట్ క్యామియో అప్పీరియన్స్ మాత్రమే. సో 45 సినిమాతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీగా చూస్తున్నారు శాండిల్ వుడ్ సినీ ఆడియన్స్. 2023లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ’45’ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసుకుంది. శివ రాజ్ కుమార్ 3డి వీడియోను షేర్ చేసిన మేకర్స్ ఈ ఏడాది ఆగస్టు 15న సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో శివరాజ్ కుమార్ ఇంటెన్సివ్ లుక్కుతో ఆకట్టుకున్నాడు. విజువల్స్ వండర్‌గా తెరకెక్కించేందుకు మార్జ్ వీఎఫ్ఎక్స్ వర్క్ చేస్తోంది. పంద్రాగస్టున పాన్ ఇండియన్ లెవల్లో సినిమాను తీసుకురాబోతున్నారు. ఈ ఏడాది మోస్ట్ ఎవటైడ్ మూవీగా నిలిచిన వార్ 2కు పోటీగా 45 రాబోతుంది. రెండు మల్టీస్టారర్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టబోతున్నాయి. మరి విజయం ఎవరినీ వరిస్తుందో చూడాలి.