Site icon NTV Telugu

తీవ్ర విషాదంలో సినీ పరిశ్రమ… పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు

Puneet-Raj-Kumar

Puneet-Raj-Kumar

కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు. ఆయన శుక్రవారం (అక్టోబర్ 29) గుండెపోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందించారు వైద్యులు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమంగా మారడంతో ఈరోజు ఆసుపత్రిలోనే కన్నుమూశారు. పునీత్‌ వయసు 46. ఆయన ఇంత చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడి కన్నుమూయడం సెలబ్రిటీలతో పాటు ఆయన అభిమానులను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో ఈరోజు మధ్యాహ్నమే విక్రమ్ ఆసుపత్రికి వెళ్ళి పునీత్ రాజ్‌ కుమార్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై. యష్ వంటి పలువురు ప్రముఖులు ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మృతితో కోలుకోలేని షాక్ కు గురైన అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read also : కన్నడ పవర్ స్టార్ కు గుండెపోటు

Exit mobile version