Site icon NTV Telugu

Anekal Balraj: మార్నింగ్ వాక్ కు వెళ్లి మృతువాత పడ్డ ప్రముఖ నిర్మాత

Balraj

Balraj

చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. కన్నడ నిర్మాత అనేకల్‌ బాలరాజ్‌ (58) దుర్మరణం పాలయ్యారు. బెంగళూరు జేపీ నగరలో నివాసముంటున్న ఆయన మార్కింగ్ వాక్ కు అని వెళ్లి మృత్యువాత పడ్డారు. ఆదివారం ఉదయం ఆయన రోడ్డుపక్కన కారు ఆపి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక బైక్ అతివేగంతో ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలరాజ్‌ తలకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిన్నటి నుంచి చికిత్స తీసుకుంటూ సోమవారం ఉదయం ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 2003లో హీరో దర్శన్ కమర్షియల్‌ హిట్‌గా నిలిచిన చిత్రం ‘కరియా’ ను నిర్మించిన నిర్మాతగా కన్నడలో మంచి గుర్తింపు ఉంది. ఇక ఈ సినిమా తరువాత ఆరు కన్నడ చిత్రాలను నిర్మించారు. బాలరాజ్ మృతి పట్ల కన్నడ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version