Kannada actor veerendra babu arrested in alleged rape case: శనివారం, కర్ణాటక పోలీసులు ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలతో ప్రముఖ కన్నడ సినీ నిర్మాతను అరెస్టు చేశారు. బాధితురాలిని ప్రముఖ కన్నడ సినీ నిర్మాత రూ.15 లక్షలు ఇవ్వాలని బెదిరించాలని, ఆమె ఇవ్వకపోతే ప్రైవేట్ వీడియోలు బయటపెడతానని హెచ్చరించారని అధికారులు వెల్లడించారు. రేప్ చేసి ప్రాణం తీస్తానంటూ బెదిరించారని చెబుతూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు నటుడు వీరేంద్రబాబును బెంగళూరులోని కొడిగేహళ్లి పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వీరేంద్ర స్నేహితుల ప్రమేయం కూడా ఉందన్న అనుమానంతో వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. 2021లో మహిళను అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లిన వీరేంద్ర ఆమెపై అత్యాచారం చేశాడని, ఆ మొత్తం వీడియో చిత్రీకరించి మహిళను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడని ఆరోపణలు వినిపించాయి.
Santhanam: తెలుగు ప్రేక్షకులే రియల్ సినిమా లవర్స్ : తమిళ నటుడు సంతానం
15 లక్షలు ఇవ్వకుంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడని, ఈ క్రమంలో ఆమె వీరేంద్రకు కొంత డబ్బు ఇచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత జులై 30న మళ్లీ ఆ మహిళకు ఫోన్ చేసిన వీరేంద్ర బాబు.. ఆమెను కారులో తిప్పుతూ బంగారు ఆభరణాలు కూడా తీసుకున్నాడని అంటున్నారు. ఈ క్రమంలో అతని స్నేహితుల ప్రమేయం కూడా ఉందని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు వీరేంద్ర, అతని స్నేహితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్ విచారణ కొనసాగిస్తోంది. వీరేంద్రబాబు హీరోగా నటించి తానే స్వయంగా నిర్మించి నిర్మించిన సినిమా “స్వయం కృషి”. ఈ సినిమాలో రెబల్ స్టార్ అంబరీష్ ముఖ్యమంత్రిగా కనిపించారు. నిజానికి కొన్ని నెలల క్రితమే నటుడు వీరేంద్రబాబు రూ.1.8 కోట్లు మోసం చేసిన కేసు కూడా వెలుగులోకి వచ్చింది. పేద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తామనే సాకుతో ప్రజల నుంచి కోట్లల్లో వసూలు చేసి ఎటువంటి సహాయం చేయకుండా మోసానికి పాల్పడ్డారని వీరేంద్ర బాబుపై చీటింగ్ కేసు నమోదయింది.