Site icon NTV Telugu

Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..?

Kannappa

Kannappa

Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. విష్ణు, మోహన్ బాబు వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ మూవీపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర భాషల్లో కూడా ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. మూవీని జూన్ 27న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారంట. ఏపీలోని భీమవరంలో ఈవెంట్ చేస్తారని టాక్. దీనికి ప్రభాస్ చీఫ్‌ గెస్ట్ గా రాబోతున్నట్టు సమాచారం. ఇందులో ప్రభాస్ రుద్ర పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read Also : Thuglife : థగ్ లైఫ్‌ ను కర్ణాటకలో రిలీజ్ చేయను.. కమల్ సంచలనం..

జూన్ 22న ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారంట. మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. ఇప్పటి వరకు ప్రభాస్ ఇలాంటి పాత్రలో నటించలేదు. ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్ గానే మోహన్ లాల్ లుక్ కూడా రిలీజ్ అయింది. మూవీ ట్రైలర్ ను ఇండోర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. దానికి అక్షయ్ కుమార్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కన్నప్పను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కించారు. దేవుడినే నమ్మని కన్నప్ప ఆ తర్వాత శివభక్తుడిగా ఎలా మారాడు అన్న కోణంలో తీస్తున్నారు.

Read Also : Amardeep-Supritha : ‘చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి’ గ్లింప్స్ రిలీజ్..

Exit mobile version