NTV Telugu Site icon

Kanguva: అయ్యా.. అయ్యా.. ఊర మాస్ అవతారం అయ్యా.. అరాచకం అంతే

Surya

Surya

Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో యోధుడి పాత్రలో సూర్య పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ చెప్పుకొస్తుంది. ఇక నేడు దీపావళీ పండుగ సందర్భంగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Tollywood: సక్సెస్ ఫుల్ హీరోల భార్యలను చూశారా.. హీరోయిన్లను మించి ఉన్నారుగా

ఇక పోస్టర్ అయితే అరాచకం అని చెప్పాలి. యోధుడు లుక్ లో సూర్య ఓ రేంజ్ లో కనిపించాడు. వెనుక శంఖారావం ఊదుతూ కొంతమంది నిలబడగా మధ్యలో సూర్య.. మండుతున్న కట్టెను పట్టుకొని నిలబడ్డాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు అయ్యా.. అయ్యా.. ఊర మాస్ అవతారం అయ్యా.. అరాచకం అంతే అని చెప్పుకోసిస్తున్నారు. సూర్యకు తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ ఉందన్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం తెలుగు ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని సమాచారం. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments