Site icon NTV Telugu

కంగనా ఇండియన్ ఏంజెలీనా అనిపించుకోవాలనుకుంటోందా!?

Kangana

Kangana

కంగనా పేరు వినగానే ఫైర్ బ్రాండ్ అని స్ఫురిస్తుంది ఎవరికైనా. సోషల్ మీడియాలో అమ్మడి ట్వీట్స్ ఎలాంటి వివాదాలను సృష్టిస్తాయో ఏమో కానీ ఇప్పుడు కంగనా కొత్త మార్గం ఎంచుకున్నట్లు అనిపిస్తోంది. ‘క్వీన్’తో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న కంగనా రనౌత్ ఆ తర్వాత పలు సందర్భాల్లో తన గ్లామర్‌ యాంగిల్ ను ప్రదర్శిస్తూ వచ్చింది.

35 సంవవత్సరాల ఈ హాటీ తాజాగా ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ తో పాటు బికినీ ట్రీట్ తో ఆశ్చర్యపరిచింది. తన తాజా చిత్రం ‘ధాకడ్’ ట్రైలర్ యు ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇది చూసిన వారందరూ కంగనాను ఏంజెలీనా జోలీతో పోలుస్తున్నారు. ఏంజెలీనా యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు గ్లామర్‌ తో ఆకట్టుకున్న వైనాన్ని గుర్తు చేసుకుంటూ కంగనా అదే తరహాలో పయనిస్తోందంటున్నారు. ఇక ‘ధాకడ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కూడా కంగనా తన స్పైసీ యాంగిల్ తో అభిమానులను ఆకట్టుకోవడం విశేషం. ఇక మే 20న విడుదల కానున్న ఈ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా కంగనాపై ఏంజెలినా ముద్ర పడటం ఖాయం. చూద్దాం ఏం జరుగుతుందో!?

Exit mobile version