Site icon NTV Telugu

మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్ గా కాంట్రవర్సీ క్వీన్

Kangana ranaut

Kangana ranaut

బాలీవడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఏం చేసినా సంచలనమే. ఈ బ్యూటీ దేశంలోనే మోస్ట్ డేరింగ్ నటిగా పేరు తెచ్చుకుంది. ఎందుకంటే ఆమె కుండబద్ధలు కొట్టినట్టుగా మాట్లాడుతుంది. ఏ విషయం గురించి అయినా ఎలాంటి బెరుకూ లేకుండా బయటకు చెప్పేస్తుంది. అలా ఆమె కామెంట్స్ దేశవ్యాప్తంగా దుమారం రేపిన వివాదాలు ఎన్నో. అందుకే ఆమెను కాంట్రవర్సీ క్వీన్ అని కూడా అంటారు. అయితే ఆమె బోల్డ్ యాటిట్యూడ్ కొంతమంది దృష్టిని మాత్రం ఆకట్టుకుందనే చెప్పాలి.

Read Also : అఫిషియల్ : ‘ రాధేశ్యామ్’ కూడా రెడీ… రిలీజ్ డేట్ అవుట్

తాజాగా కంగనా మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్ గా వ్యవహరించబోతోందట. టీవీ క్వీన్ ఏక్తా కపూర్ కంగనాను ఆల్ట్ బాలాజీ మరియు MX ప్లేయర్ కోసం రూపొందించే క్రేజీ, డేరింగ్ రియాలిటీ షో కోసం ఎంచుకుంది. కంగనా ఈ షోను హోస్ట్ చేస్తుంది. ఇది బిగ్ బాస్ మాదిరిగానే ఉంటుంది. అయితే వార్తల ప్రకారం కంటెంట్ మరింత డేరింగ్ గా ఉంటుంది. ప్రముఖ సెలబ్రిటీలు పార్టిసిపెంట్స్‌గా పాల్గొనే ఈ షోను హోస్ట్ చేయడానికి కంగనాకు భారీగానే చెల్లించారని సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రాబోతోంది.

Exit mobile version