Kangana Ranaut Warning Board Becomes Talk Of The Town: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈమధ్య తన సినిమాల కన్నా.. వివాదాస్పద చర్యల వల్లే వార్తల్లో నానుతోంది. పాలిటిక్స్ మీదనో, సినీ పరిశ్రమలోని అక్రమాల మీదనో.. నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వెల్లడిస్తుంది. అవతల ఎంత పెద్ద వ్యక్తులైనా సరే.. ఎలాంటి బిడియం లేకుండా నిలదీస్తుంది. వివాదాస్పద సందర్భాల్లోనూ.. తనదైన రీతిలో రియాక్ట్ అవుతూ, టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంది. అందుకే.. కథానాయికల్లో ఈ అమ్మడి రూట్ సెపరేట్ అని అందరూ అంటుంటారు. ఇందుకు సాక్ష్యంగా ఇప్పుడు మరో షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. అది చూసి.. ఎవ్వరైనా ఖంగుతినకుండా ఉండలేరు.
RC 15: మెగా పవర్ స్టార్ గుర్రం ఎక్కితే బాక్సాఫీస్ బద్దలవుతుంది…
సాధారణంగా.. తమ ఇళ్లల్లో అనామకులు గానీ, దొంగలు గానీ చొరబడకుండా ఉండేందుకు కొందరు ఇంటి బయట ఒక వార్నింగ్ బోర్డు పెడతారు. ఆ బోర్డుపై ‘కుక్కలు ఉన్నారు జాగ్రత్త’ అనే హెచ్చరిక ఉంటుంది. కానీ.. కంగనా మాత్రం అందుకు భిన్నంగా ‘చంపేస్తా’ అంటూ వార్నింగ్ బోర్డు పెట్టింది. ముంబైలో ఉన్న తన ఇంటి ముందు ‘‘అనామకులకు ప్రవేశం లేదు, ఒకవేళ హద్దు మీరితే కాల్చి చంపేస్తా, అప్పటికీ ప్రాణాలతో బయటపడితే మళ్లీ కాల్చబడతారు’’ అనే హెచ్చరిక బోర్డుని పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కొందరు కంగనా ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని కొనియాడుతుంటే, మరికొందరు ఈ తరహా బోర్డులు ఎలా పెడతారు అంటూ ప్రశ్నిస్తున్నారు.
Illegal Affair: అక్రమం సంబంధం మోజులో.. కట్టుకున్న భర్తను కాటికి పంపిన వైనం
కాగా.. గతంలో ముంబైలోని బాంద్రాలో కంగనా రనౌత్ ఆఫీస్‌ని కూలగట్టిన బృహణ్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేసిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. శివసేన, కంగనా మధ్య మాటల యుద్ధం జరిగినప్పుడు.. అది అక్రమ నిర్మాణమని పేర్కొంటూ ఆఫీస్‌ని కూల్చారు. అంతకుముందే ఆమెకు నోటీసులు ఇవ్వగా.. దానిపై సమాధానం ఇవ్వకపోడంతో బీఎంసీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. బహుశా ఆ సంఘటనని దృష్టిలో పెట్టుకునే.. కంగనా ఈ తరహా హెచ్చరిక బోర్డు పెట్టుకొని ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
