NTV Telugu Site icon

Kangana Ranaut: నిజమే.. బాలీవుడ్ మహేష్ ను భరించలేదు..

Kangana

Kangana

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడు ఎలాంటి బాంబ్ పేలుస్తుందో ఎవరు ఊహించలేరు. బాలీవుడ్ మొత్తం ఒకవైపు ఉంటే .. కంగనా ఒక్కత్తే ఒకవైపు ఉంటుంది.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనం రేపుతున్న విషయం విదితమే. తనను బాలీవుడ్ భరించలేదు అన్న మాటలను తప్పుగా అర్ధం చేసుకొని బాలీవుడ్ మీడియా వాటిని కాంట్రవర్సీ చేసి డిబేట్ లు పెడుతున్న విషయం విదితమే. ఇక తాజాగా కంగనా ఈ వ్యాఖ్యలపై స్పందించింది. మహేష్ కు సపోర్ట్ గా నిలుస్తూ తనదైన రీతిలో బాలీవుడ్ మీడియాను ఏకిపారేసింది. ఆమె నటించిన ‘ధాకడ్’ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌లో భాగంగా ఆమె ఈ విధంగా మాట్లాడింది.

“మహేష్ అన్నదాంట్లో తప్పేముంది.. అవును.. నిజమే మహేష్ ను బాలీవుడ్ భరించలేదు.. ఆయన ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకరు.. పాన్ ఇండియా లెవల్లో టాలీవుడ్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. కాబట్టి ఆయనకి తగిన రెమ్యునరేషన్‌ని బాలీవుడ్‌ ఇవ్వలేదు. ఆయన కోసం బాలీవుడ్ నిర్మాతలు ఎన్నిసార్లు ప్రయత్నించారో నాకు తెలుసు .. అయినా మహేష్ అన్న మాటలను మీరెందుకు ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారో తెలియడం లేదు. మహేష్ కు టాలీవుడ్ పైన, ఆయన చేసే పనిపైన ఎంత గౌరవం, నిబద్దత ఉన్నాయో ఆయన మాటలు వింటుంటే అర్ధమవుతుంది. ఆయన అలా ఉన్నారు కాబట్టే ఈ స్థాయిలో ఉండగలిగారు. అది మనమందరం అంగీకరించాలి” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక దీంతో మహేష్ ఫ్యాన్స్ కంగనా చెప్పింది అక్షరాలా సత్యం అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.