Kangana-Aishwarya Rai: ఐశ్వర్య లుక్‌పై ట్రోల్స్.. కంగనా రనౌత్ సీరియస్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఎన్నో ఏళ్లుగా కాన్స్ చలనచిత్రోత్సవంలో భారతదేశం తరఫున ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు ఐశ్వర్యా రాయ్. ఈ ఏడాది కూడా ఆమె తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ఎంతో ఆత్మవిశ్వాసంతో కాన్స్ రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. అయితే, ఆమె ధరించిన అవుట్‌ఫిట్స్, అలాగే ఆమె వయసు (50 ఏళ్ల పైబడిన లుక్) ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ ట్రోలింగ్‌పై కంగనా రనౌత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.. తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ఐశ్వర్యకు అండగా నిలుస్తూ
‘ఫ్యాషన్, స్టైల్ అనేది పూర్తిగా వ్యక్తిగతమైనది. ఎవరికి నచ్చినట్లు వారు బట్టలు ఎంపిక చేసుకునే హక్కు వారికి ఉంటుంది. ఈ విషయంలో ఏ మహిళ కూడా ఎవరికీ ఎటువంటి వివరణ ఇవ్వక్కర్లేదు. కేన్స్‌లో ఐశ్వర్య అద్భుతంగా ఉన్నారు. ఐశ్వర్యను మరేదైనా స్టైల్లో చూడాలనుకుంటూ విమర్శలు చేసేవారు.. మొదట మీ దగ్గర ఏముందో, మీ ఫ్యాషన్ సెన్స్ ఏంటో ప్రపంచానికి చూపించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఫ్యాషన్, స్టైల్ మెయింటైన్ చేయడం ఎంత కష్టమో!’ అని కంగనా సవాల్ విసిరారు. అంతే కాదు ‘రెడ్ కార్పెట్‌పై ఎప్పుడూ కేవలం యువ నటీమణులే (Young Actresses) ఉండాలి అనుకోవడం తప్పు. అక్కడ 50 ఏళ్ల వయసులో ఉన్నవారు కూడా ఉంటారు. ఒకవేళ అంతర్జాతీయ వేదికలపై అలాంటి పెద్ద వయసు మహిళలను చూడడం మీకు అలవాటు లేకపోతే.. ఇకనైనా ఆ విషయాన్ని చూసి అలవాటు చేసుకోండి’ అని కంగనా తన పోస్ట్‌లో కుండబద్దలు కొట్టారు.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
దీంతో నటీమణులు వయసు పైబడుతున్న కొద్దీ వారి లుక్స్, బాడీ షేమింగ్‌పై సమాజం చూపే వివక్షను కంగనా సరిగ్గా పాయింట్ అవుట్ చేసిందని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఐశ్వర్యా రాయ్ దశాబ్దాలుగా అంతర్జాతీయ వేదికపై భారత్ గర్వపడేలా ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అలాంటి సెలబ్రిటీని గౌరవించాల్సింది పోయి వయసు పేరుతో ట్రోల్ చేయడం కరెక్ట్ కాదంటూ కంగనా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!