బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనుసులో ఏమనుకుంటుందో అది ఏమాత్రం మొహమాటం లేకుండా బయటపెట్టేస్తుంది. హీరో, హీరోయిన్, రాజకీయాలు అనే తేడా కూడా ఉండదు. ఇక తాజాగా అమ్మడు దీపికా సినిమాపై పడింది. ఇటీవల దీపికా పదుకొనే,న అనన్య, సిద్దాంత్ నటించిన ‘గెహ్రియాన్’ సినిమా అమెజాన్ లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక తాజాగా ఈ సినిమాపై కంగనా తనదైన రీతిలో స్పందించింది. ఘాటు వ్యాఖ్యలతో మరో వివాదాన్ని రెచ్చగొట్టేసింది.
” నేను యువతరం మనిషినే.. కానీ, నాకు ఇలాంటి రొమాన్స్ ని అర్ధం చేసుకోగలను.. అయితే ఈ తరం యువత, అర్బన్ సినిమాలతో చెత్తను అమ్మకానికి పెట్టకండి చెడ్డ సినిమాలు ఎప్పుడు చెడ్డగానే ఉంటాయి. స్కిన్ షో గానీ, శృంగారం కానీ వాటిని కాపాడలేవు. ఇది బేసిక్ గా వాస్తవం. ‘గెహ్రియాన్’ గురించయితే మాట్లాడలేదు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దీపికా ఇంటిమేట్ సీన్లతో రెచ్చిపోయిన ఈ మూవీ ప్రస్తుతం నెటిజన్ల చేత కూడా విమర్శలు అందుకుంటుంది. మరి కంగనా మాటలపై దీపికా ఎలా స్పందిస్తుందో చూడాలి.
