Site icon NTV Telugu

Kangana Ranaut : స్టార్ హీరోయిన్ అయినా ఆమె ఆ కేసులో నిందితురాలు.. గుర్తుపెట్టుకోండి

kangana ranaut

kangana ranaut

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనాకు వివాదాలు వదలడం లేదు. అప్పుడెప్పుడో ఆమె చేసిన వివాదాస్పద వైకాయలు ఇప్పటికీ ఆమెను వేధిస్తూనే ఉన్నాయి. గతంలో కంగనా, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఇక ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ జావేద్, కంగనాపై పరువు నష్టం కేసును వేశారు. గత కొన్నినెలల నుంచి ఈ కేసు ముంబై కోర్టులో నడుస్తుండగా.. ఇటీవల కంగనా కేసు విచారణకు ప్రత్యక్ష హాజరునుంచి మినహాయింపునివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేయగా.. తాజాగా కోర్టు కంగనాకు షాక్ ఇచ్చింది. కంగనా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్‌ ఆర్‌ఆర్‌ఖాన్‌, కంగనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె పెట్టిన పిటిషన్ ని కొట్టివేస్తూ ఆమె సెలబ్రిటీ కావొచ్చు కానీ ఒక కేసులో నిందితురాలు.. అది మర్చిపోకూడదని తెలిపారు.

ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరుకాకుండా ఎగ్గొట్టడమే కాకుండా కేసు విచారణకు ప్రత్యక్ష హాజరునుంచి మినహాయింపునివ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందని, అసలు కేసు ఎక్కడివరకు వెళ్లిందో, విచారణలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మినహాయింపు కోరడం మీదనే ప్రత్యేక శ్రద్ద పెట్టడమేంటని మండిపడ్డారు. ఇక ఇప్పటివరకు విచారణకే రాని ఆమెకు ఇప్పుడు మినహాయింపు ఇస్తే అస్సలు ఇకనుంచి విచారణకు కూడా రాదని, అందుకే ఆ పిటిషన్ ను కొట్టివేస్తునట్లు తెలిపారు. దీంతో కంగనాకు గట్టి దెబ్బనే తగిలిందని చెప్పాలి. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో.. కంగనా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో ఓ కోటరీ ఉందనీ, అందులో జావేద్ కూడా ఉన్నారని కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జావేద్ ఆమెపై కోర్టులో కేసు వేశారు. మరి కోర్టు ఇచ్చిన షాక్ కి ఈ ఫైర్ బ్రాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version